ఇటీవల హీరోయిన్లు అందరూ ఆ దేవాలయంలో పూజలు చెయ్యడం మొదలుపెట్టారు. జాన్వీ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, శృతి హాసన్, రాణి ముఖర్జీ, ప్రీతి జింటా, కంగన రనౌత్, ఊర్వశి రౌటేలా… ఇలా పలువురు సినిమా తారలు గతేడాది కాలంలో ఆ దేవాలయాన్ని సందర్శించి పూజలు చేశారు.
ఆ ప్రసిద్ధి చెందిన గుడి అస్సాంలో ఉంది. కామాఖ్య దేవి ఆలయం అది. 51 శక్తిపీఠాల్లో నాలుగో శక్తిపీఠం ఈ దేవాలయం. మనదేశంలో చాలా పురాతనమైన దేవాలయాల్లో ఒకటి. అలాగే మహిళల పునరుత్పత్తి శక్తిని గర్వంగా సంబరాలు జరపడం ఈ దేవాలయంలో ఆచారం.
సంయుక్త కూడా తాజాగా ఈ దేవాలయాన్ని సందర్శించింది. ప్రత్యేక పూజలు చేసింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సాధారణంగా ఈ గుడిలో పెళ్లి కావాలనుకునే మహిళలు, పెళ్లయ్యాక పిల్లలు కలగాలని కోరుకునే స్త్రీలు ప్రత్యేక పూజలు చేస్తారు. సంయుక్త పెళ్లి కోసమే వెళ్లిందా?
ALSO READ: Will Samyuktha’s game plan succeed?
సంయుక్త తెలుగులో “భీమ్లా నాయక్”, “బింబిసార”, “సార్”, “విరూపాక్ష” వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె నిఖిల్ సిద్ధార్థ్ సరసన “స్వయంభు” అనే సినిమాలో నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఒక బాలీవుడ్ సంస్థతో ఇప్పటికే చర్చలు జరిగాయట.
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More
పవన్ కల్యాణ్ లో నటుడు మాత్రమే కాదు.. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, లిరిసిస్ట్ కూడా… Read More
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More