రాజమౌళి తీసే చిత్రాలకు కథలు అందించేది ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్. ఒకటి రెండు తప్ప దాదాపుగా రాజమౌళి తీసిన అన్ని చిత్రాలకు విజయేంద్రప్రసాద్ స్టోరీ రాశారు. ఐతే తన కొడుకుతో పని చేసినప్పుడు తనకు రాత పని తక్కువ ఉంటుంది అని చెప్తున్నారు విజయేంద్ర ప్రసాద్.
“రాజమౌళికి నేను కథ మొత్తం చెప్పను. ఎక్కువగా సీన్లు చెప్తాను, క్యారెక్టర్ల గురించి వివరిస్తాను. నేను ఒక లైన్ గా స్టోరీ చెప్తే రాజమౌళి మొత్తం స్క్రీన్ ప్లే అల్లుకుంటాడు. మిగతా దర్శకులకు నేను, నా టీం రాసి మొత్తం స్క్రిప్ట్ ఇస్తాం. రాజమౌళి సినిమాల విషయంలో నేను రాసేది తక్కువ. ఎక్కువగా నోటితో చెప్తాను. తాను దాన్ని బాగా మలుచుకుంటాడు,” అని విజయేంద్రప్రసాద్ తెలిపారు.
ఇక ఇప్పుడు రాజమౌళి తదుపరి చిత్రానికి కూడా విజయేంద్ర ప్రసాద్ కథే మూలం. “ఎలాంటి కథ కావాలో, ఏ జాన్రాలో అనుకుంటున్నాడో ముందే చెప్తాడు. ఈ సారి విలుబుర్ స్మిత్ నవలల తరహాలో స్క్రిప్ట్ కావాలని అడిగాడు రాజమౌళి. మేం ఇద్దరం ఆయన నవలలకు అభిమానులం. సో, జాన్రా ఫిక్స్ కావడంతో పని సులువు అయింది. ఈ సారి కూడా ఇంతకుముందు రాజమౌళి తీయని యాంగిల్ టచ్ చేశాం స్క్రిప్ట్ లో,” అని విజయేంద్రప్రసాద్ కొత్త సినిమా సినిమా గురించి చెప్పారు.
రాజమౌళి తీసే కొత్త సినిమాలో మహేష్ బాబు హీరో. “కథ, క్యారెక్టర్లు నావే. స్క్రీన్ ప్లే రాజమౌళిది. డైలాగులు వేరే వాళ్ళు రాస్తారు. ఈసారి డైలాగులు ‘ఆర్ ఆర్ ఆర్’కి రాసిన బుర్రా సాయి మాధవ్ రాస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ జూన్ లో కానీ జులైలో కానీ మొదలవుతుంది.
కె.ఎల్. నారాయణ నిర్మించే ఈ సినిమాకి హీరోయిన్, ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఒక హాలీవుడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటారట.
రాజమౌళి, విజయేంద్రప్రసాద్, మహేష్ బాబు, రాజమౌళి మహేష్ బాబు మూవీ, విజయేంద్రప్రసాద్ కథ,
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More
అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More
ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More