ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను మానసికంగా ఇప్పటికీ బాధపెడుతున్నాడట. అయితే ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగానే.
ప్రభాస్ విషయంలో నిత్యామీనన్ చేసిన తప్పు, అతడి అభిమానులకు ఇంకా గుర్తే. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి అడిగితే అతడెవరో తనకు తెలియదంటూ స్పందించింది నిత్యా మీనన్.
ఆ టైమ్ లో ప్రభాస్ ఫ్యాన్స్, ఆమెపై విరుచుకుపడ్డారు. ఆ ట్రోలింగ్ ను నిత్యామీనన్ తట్టుకోలేకపోయింది. ఆ బాధ తనను ఇంకా వెంటాడుతోందని, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది నిత్యా.
తెలుగులో కెరీర్ అప్పుడే మొదలుపెట్టానని, నిజంగా అప్పుడు తనకు ప్రభాస్ తెలియదని, అయితే ఆ విషయాన్ని అలా ఓపెన్ గా చెప్పడం తప్పనే విషయాన్ని ఆ తర్వాత తెలుసుకున్నానని అంటోంది నిత్యామీనన్. మీడియా ముందు మాట్లాడేటప్పుడు లౌక్యం అవసరమనే విషయాన్ని కూడా ఆ ఘటన తోనే తెలుసుకున్నట్టు వెల్లడించింది.
ఇప్పటికీ ఆ ఇష్యూ తనను మానసికంగా వెంటాడుతోందని, ప్రభాస్ ఎవరో తెలియదని చెప్పడం తనను ఇప్పటికీ బాధిస్తోందని గిల్ట్ ఫీల్ అవుతోంది నిత్యామీనన్.
తన సినిమాలో చిరంజీవి పాత్రపై స్పందించాడు అనీల్ రావిపూడి. కామెడీ టైమింగ్ లో చిరంజీవి నెక్ట్స్ లెవెల్ అని తెలిపిన… Read More
పాత్ర డిమాండ్ చేస్తే ఎంత కష్టమైనా పడాల్సిందే. అవసరమైతే కొత్త విద్యలు నేర్చుకోవాల్సిందే. 'హరిహర వీరమల్లు' సినిమా కోసం నిధి… Read More
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న 'కూలీ' సినిమా వచ్చే నెల విడుదల కానుంది. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర వంటి… Read More
కొన్ని రోజుల కిందటి సంగతి. ఊహించని విధంగా డెకాయిట్ సినిమా నుంచి శృతిహాసన్ తప్పుకుంది. అప్పటికే ఆమెపై గ్లింప్స్ కూడా… Read More
కొన్ని రోజులుగా 'విశ్వంభర' సినిమాపై చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది థియేటర్లలోకి… Read More
త్వరలోనే ఓ పెద్ద సినిమా ప్రకటన రాబోతోందంటూ ఊరిస్తూ వస్తున్నారు దిల్ రాజు. ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది.… Read More