హీరోలు రాజకీయాల్లోకి రావడం దశాబ్దాలుగా చూస్తున్నాం. అలా వచ్చిన వాళ్లలో ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి క్లిక్ అయిన నాయకుల్ని కూడా చూశాం. అదే విధంగా హీరోయిన్లు కూడా అనాదిగా పాలిటిక్స్ లోకి వస్తున్నారు. కానీ క్లిక్ అయిన సందర్భాలు చాలా తక్కువ.
అలనాటి జయలలిత నుంచి చూసుకుంటే, విజయశాంతి, జయప్రద, జయసుధ, హేమమాలిని, నగ్మా, ఖుష్బూ, కంగనా రనౌత్.. ఇలా చాలామంది తారలు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే జయలలితలా ఎవ్వరూ ముఖ్యమంత్రి కాలేకపోయారు. మరి త్రిష పరిస్థితేంటి?
తాజాగా త్రిష కూడా రాజకీయాలపై తన ఆసక్తిని బయటపెట్టింది. తనకొచ్చిన పాపులారిటీతో ప్రజాసేవ చేస్తానని, తమిళనాడుకు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశ కూడా ఉందంటూ, తన మనసులో మాట బయటపెట్టింది.
జయలలిత మినహా, మరో నటి తమిళనాట సీఎం స్థాయికి ఎదిగలేకపోయారు. పైన చెప్పుకున్న తారలతో పాటు, మరెంతోమంది నటీమణులు రాజకీయాల్లో ఉన్నారు కానీ ముఖ్యమంత్రి స్థానం వరకు చేరుకోలేకపోయారు. పైగా తమిళ రాజకీయాల్లో ఇప్పటికే కావాల్సినంత స్టార్ ఎట్రాక్షన్ ఉంది. త్రిషకు ఇక చోటెక్కడుంది?
విజయ్ తాజాగా పార్టీ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తనదైన మార్కు చూపించబోతున్నాడు. కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టారు. వీళ్లతో పాటు ఉదయనిధి స్టాలిన్, శరత్ కుమార్, రాధిక, ఖుష్బూ లాంటి చాలామంది నటులు రాజకీయాల్లో ఉన్నారు.
ఇలాంటి టైమ్ లో రాజకీయాల్లోకి వస్తానంటోంది త్రిష, వస్తే పర్లేదు, ఆమెకు చోటుంటుంది. కానీ ఏకంగా ముఖ్యమంత్రి అవుతానంటూ ఆమె ప్రకటించడం.. ఆదిలోనే తన అవకాశాలకు తానే గండికొట్టుకున్నట్టయింది.
ప్రస్తుతం కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది త్రిష. 41 ఏళ్ల వయసులో కూడా తిరుగులేని క్రేజ్ తో, మరోసారి స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ఇప్పుడు అదే క్రేజ్ ను తన పొలిటికల్ ఎంట్రీ కోసం వాడుకోవాలని చూస్తోంది. సినిమాల్లో సూపర్ సక్సెస్ అయిన త్రిష, రాజకీయాల్లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More