నయనతార, విగ్నేష్ మొదటిసారి “నానుమ్ రౌడీ దాన్” (నేను రౌడీనే) సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ సినిమాకి విగ్నేష్ దర్శకుడు. హీరో ధనుష్ నిర్మాత. విజయ్ సేతుపతి, నయనతార తెరపై రొమాన్స్ చేసుకోగా, తెర వెనుకాల నయనతార, విగ్నేష్ ప్రేమించుకున్నారు. వారి ప్రేమ పెళ్లిగా మారింది. వారికి ఇప్పుడు ఇద్దరు కవలలు (సరోగసి ద్వారా).
ఐతే వీరి పెళ్లి వీడియోని ఒక డాక్యమెంటరీగా తీసి నెట్ ఫ్లిక్స్ కి అమ్మారు నయనతార, విగ్నేష్. కానీ ఈ డ్యాకుమెంటరీలో “నానుమ్ రౌడీ దాన్”కి సంబంధించిన క్లిప్పింగ్స్, పాటలు, ఫోటోలు…. ఏవీ వాడేందుకు నిర్మాత అయిన ధనుష్ ఒప్పుకోలేదట. దాంతో రెండేళ్లు వెయిట్ చేసి తాజాగా అందులో ఆ సినిమా మేకింగ్ వీడియోలో 3 సెకండ్ల విజువల్స్ వాడారు. కానీ ఆ మేకింగ్ వీడియో వాడినందుకు ధనుష్ 10 కోట్ల రూపాయల పరిహారం అడిగాడని నయనతార ఆరోపిస్తోంది.
తాజాగా ఆమె విడుదల చేసిన సుదీర్ఘ లేఖ పెద్ద దుమారమే రేగింది.
ALSO READ: Nayanthara launches a scathing attack on Dhanush via letter
అసలు గొడవకు కారణం…
“నానుమ్ రౌడీ దాన్” సినిమా 2015లో విడుదలైంది. దాదాపు 9 ఏళ్ళు గడిచినా ఆ సినిమా వివాదం ఎందుకు సృష్టిస్తోంది? ఈ సినిమాని నిర్మించిన ధనుష్ కి ఎందుకు నయనతారపై ఎందుకు కోపం?
నిజానికి నయనతార, ధనుష్ కి గొడవ ఆ సినిమా విడుదలైన తర్వాతే మొదలైంది. సినిమా మంచి విజయం సాధించింది. కానీ విగ్నేష్ సినిమా బడ్జెట్ ని విపరీతంగా పెంచి తనకు లాభాలు రాకుండా చేశాడు అని ధనుష్ భావించాడని అంటారు. ఆ సినిమాకి ఉత్తమ నటిగా ఫిలింఫెర్ అవార్డు అందుకున్న నయనతార …. స్టేజిపైనే ధనుష్ కి తన నటన నచ్చలేదని సెటైర్ వేసింది. అలా మొదటిసారిగా వారి మధ్య ఉన్న గొడవలు బయటికి వచ్చాయి.
అలాగే ధనుష్ వద్ద అసిస్టెంట్ గా పని చేశాడు విగ్నేష్. అతని టాలెంట్ నచ్చి ధనుష్ విగ్నేష్ కి దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. కానీ నయనతార ప్రేమలో పడి సినిమాని ఓవర్ బడ్జెట్ చేశాడు ధనుష్ అప్పట్లో విగ్నేష్ ని తిట్టాడట. అలా అటు వైపు, ఇటువైపు దూరం పెరిగింది. ఇందులో ఎవరు కరెక్ట్ అనేది చెప్పలేం కానీ “ఇగో”నే ఇంత లొల్లికి కారణం.
ఇగోనే సమస్య
తన సినిమా క్లిప్స్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించుకోవడానికి నిర్మాతగా ధనుష్ కి హక్కు ఉంది. నయనతార ఆ సినిమాలో నటించినంత మాత్రాన ఆమె ఆ క్లిప్స్ ని నిర్మాత అనుమతి లేకుండా ఒక డాక్యుమెంటరీకి ఇవ్వలేదు. ఎందుకంటే… ఇది నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యే డాక్యుమెంటరీ. ఆమె దగ్గరి నుంచి నెట్ ఫ్లిక్స్ హక్కులు కొనుక్కొంది. అంటే ఆమె దానిపై సంపాదిస్తోంది. ఆమె చేసేది చారిటీ ప్రోగ్రాం కాదు. సో, నిర్మాత అనుమతి లేకుండా ఆమె ఎటువంటి విజువల్స్ వాడలేదు.
కానీ 3, 4 సెకండ్ల క్లిప్ కోసం ధనుష్ ఎందుకు అంతగా పట్టుబడుతున్నట్లు? అంటే, ఇద్దరి మధ్య ఎదో గొడవ చాన్నాళ్లుగా ఉంది. అందుకే, ధనుష్ హార్ట్ అయి అంత పట్టుదలగా ఉన్నాడు. ఏది ఏమైనా ఇది ‘పట్టుదల’కి పోయిన విషయమే తప్ప పబ్లిక్ గా కొట్లాడుకోవాల్సిన మేటర్ కాదు.
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More
అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More
ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More