అల్లు అర్జున్ అత్యధిక పారితోషికం అందుకునే హీరోల్లో ఒకరు. సినిమాకు 150 కోట్లవరకు తీసుకుంటారట. ఐతే, మూడేళ్లకు ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నారు. ఆ లెక్కన చూస్తే అతనికి సినిమాల ద్వారా ఏడాదికి 50 కోట్లు మాత్రమే వస్తాయి. ఎందుకంటే ‘పుష్ప-2’ కోసం మూడేళ్లు టైమ్ తీసుకున్నాడు ఈ హీరో.
ప్రభాస్ వంటి హీరోలు ప్రతి ఏడాది ఒక సినిమా వచ్చేలా చూసుకుంటున్నారు. ప్రభాస్ సంపాదన ఎక్కువ. బన్నీ చాలా లాస్ అవుతున్నాడు. అందుకే ఇకపై రెండేళ్లకు 3 సినిమాలు వచ్చేలా ప్లాన్ చేస్తానని అంటున్నాడు.
రెండు, మూడేళ్లకు ఒక్క సినిమా చెయ్యడం వల్ల కోల్పోయిన సంపాదనని, నష్టపోయిన ఆ మొత్తాన్నిఇకపై వేగంగా సినిమాలు చేసి భర్తీ చేస్తాడట.
మరోవైపు, తాను అందుకున్న మొదటి అడ్వాన్స్ గురించి కూడా చెప్పాడు. ఒకరోజు రాఘవేంద్రరావు అల్లు అర్జున్ చేతిలో వంద రూపాయలు పెట్టారంట. “ఇదే అడ్వాన్స్, నువ్వు నాకు ఓ సినిమా చేయాలి” అన్నారట. అలా రాఘవేంద్రరావు చేతులు మీదుగా తొలిసారి వంద రూపాయలు అడ్వాన్స్ అందుకున్నానని, ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే హీరోగా పరిచయమయ్యానని గుర్తుచేసుకున్నాడు బన్నీ.
తనకు హీరోగా జన్మనిచ్చిన రాఘవేంద్రరావును ఎన్నటికీ మరిచిపోనని, తన ఆఫీస్ లో అడుగుపెట్టడానే డోర్ దగ్గర ఆయన ఫొటోనే ఉంటుందని అన్నాడు.
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More
అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More
ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More