ప్రతి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కామన్ అయిపోయింది. కేరళలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటకొచ్చిన తర్వాత చాలామంది హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాల్ని బయటపెట్టడానికి ధైర్యంగా ముందుకొస్తున్నారు.
తాజాగా హీరోయిన్ కావ్య థాపర్ సంచలన ప్రకటన చేసింది. తనకు కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవం ఉందని చెప్పుకొచ్చింది. “ఆఫర్ ఇస్తాను పక్కలో పడుకోవాలని” ఒకడు నేరుగా తనను సంప్రదించాడని ఆరోపించింది.
కెరీర్ స్టార్టింగ్ లో పోర్టుపోలియో ఆల్బమ్స్ పట్టుకొని తిరుగుతున్న రోజుల్లో, ఓ యాడ్ లో నటించే అవకాశం వచ్చిందట. ఆడిషన్ ఇవ్వడానికి ఆఫీస్ కు వెళ్లిందంట. అక్కడున్న డైరక్టర్, ఒకటి కాదు, నాలుగు యాడ్స్ లో అవకాశం ఇస్తానని, కాకపోతే కమిట్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని అన్నాడట.
దీంతో వెంటనే ఆ ప్రతిపాదనకు నో చెప్పిందట కావ్య థాపర్. అయినప్పటికీ అతడు వదలకుండా వెంట పడ్డంతో, తర్వాత తల్లితో కలిసి ఆఫీస్ కు వెళ్లిందంట. కావ్య తల్లి సదరు దర్శకుడి చెంప ఛెళ్లుమనిపించిందంట.
కావ్య థాపర్ ను నటిగా చూడాలనేది ఆమె తండ్రి కోరికంట. అందుకే చదువు పూర్తిచేసి సినిమాల్లోకి వచ్చానంటోంది కావ్య.
ఈ ఏడాది ఈ భామ తెలుగులో “డబుల్ ఇస్మార్ట్”, “ఊరు పేరు భైరవకోన”, “ఈగిల్”, ‘విశ్వం’ సినిమాల్లో నటించింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More