ఆలియా భట్ గ్రాఫ్ పెరుగుతోంది. పాపులారిటీ పైపైకి వెళ్తోంది. ఇప్పటికే ఆమె గ్లోబల్ స్టార్ గా ఎదిగింది. ఆమెకి పెళ్లి అయింది, ఒక పాప కూడా పుట్టింది. అయినా ఆమెకి అవకాశాలు సన్నగిల్లలేదు. పైగా ఇప్పుడే ఆమెకి ఎక్కువ క్రేజ్. దానికితోడు అంతర్జాతీయ పత్రిక టైం మేగజైన్ కూడా ఆమెని గుర్తించింది.
100 Most Influential People 2024 పేరుతో టైం మేగజైన్ తాజాగా 100 మంది జాబితా విడుదల చేసింది. ప్రపంచం మొత్తంగా 100 మందిని తీసుకుంటే అందులో మన భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు 8 మంది ఉన్నారు.
సినిమా రంగం నుంచి ఇద్దరికే చోటు దక్కింది. ఒకరు అలియా భట్. మరొకరు దేవ్ పటేల్.
“గంగూబాయి”, “ఆర్ ఆర్ ఆర్”, “హార్ట్ ఆఫ్ స్టోన్” వంటి చిత్రాలతో ఆమె గ్లోబల్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పటికే ఒక హాలీవుడ్ మూవీలో నటించిన ఆలియా ఇక ముందు మరిన్ని అంతర్జాతీయ చిత్రాల్లో అవకాశాలు రావొచ్చు.
“స్లమ్ డాగ్ మిలియనీర్” సినిమాతో పరిచయమైన దేవ్ పటేల్ ఇటీవలే “మంకీ మేన్” అనే హాలీవుడ్ చిత్రంలో నటించాడు, డైరెక్ట్ చేశాడు. హాలీవుడ్ లో ఇప్పటికే హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. సో, అతనికి ఈ లిస్టులో చోటు దక్కడంలో వింతేమీ లేదు. కానీ ఆలియా భట్ ని అంత ప్రభావశీలమైన వ్యక్తిగా గుర్తించడం గ్రేటే.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More