ఎన్నో ఆశలు, అంచనాలతో మొదలైన 2024 సంవత్సరం మరో 50 రోజుల్లో ముగియనుంది. ఎప్పట్లానే ఈ ఏడాది బాక్సాఫీస్ కూడా సాదాసీదాగానే సాగింది. పట్టుమని 10 సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ హోదా అందుకున్నాయి. మరి ఈ మిగిలిన 50 రోజుల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ మెరుస్తుందా?
రాబోయే 50 రోజుల్లో రానున్న కీలకమైన సినిమా ‘పుష్ప-2’. అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. ఇది బ్లాక్ బస్టర్ హిట్టయితే 2024 ఘనంగా ముగిసినట్టే. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఆల్రెడీ వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ ఇయర్ గ్రాండ్ గా ముగియాలంటే, ‘పుష్ప-2’ హిట్టవ్వాల్సిందే.
ఈ ఏడాది రాబోతున్న మరికొన్ని ముఖ్యమైన చిత్రాల్లో ‘రాబిన్ హుడ్’ కూడా ఒకటి. నితిన్-శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమా సక్సెస్ టాలీవుడ్ కు ఎంత అవసరమో.. ఈ హీరోహీరోయిన్లకు కూడా అంతే అవసరం.
అటు ‘మట్కా’, ‘మెకానిక్ రాకీ’ లాంటి సినిమాలు కూడా విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ 50 రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఇంపార్టెంట్ మూవీస్ ఇవి మాత్రమే. ఇవన్నీ హిట్టయితే, ఈ ఏడాది టాలీవుడ్ కళకళలాడినట్టే. ఇయర్ కు ఘనంగా సెండాఫ్ ఇచ్చినట్టే.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More