అవీ ఇవీ

కోట ఇప్పుడు ఇలా అయిపోయారు!

Published by

వయసురీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పుకార్లు వస్తూనే ఉన్నాయిు. ఒక దశలో కోట శ్రీనివాసరావు కన్నుమూశారంటూ కొన్ని హ్యాండిల్స్ లో పుకార్లు కూడా వచ్చాయి. వాటిని ఆయన ఖండించారు.

మరి ఇప్పుడు కోట శ్రీనివాసరావు ఎలా ఉన్నారు? తాజాగా నటుడు-నిర్మాత బండ్ల గణేశ్, కోట శ్రీనివాసరావును పలకరించారు. ఆయనతో దిగిన ఫొటోను పోస్టు చేశారు. అందులో కోట చాలా బలహీనంగా ఉన్నారు.

మరీ ముఖ్యంగా ఆయన కాళ్లు బాగా చెడిపోయాయి. కాలి బొటనవేలు తొలిగించినట్టు కనిపిస్తోంది. మరో కాలికి కట్టు కనిపిస్తోంది. మనిషి కూడా బక్కచిక్కిపోయారు. చూస్తుంటే, ఆయన షుగర్ తో ఇబ్బంది పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

అయినప్పటికీ తను ఉన్నంతలో ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పే ప్రయత్నం చేశారు కోట. వయసు రీత్యా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వాటిని అధిగమిస్తూ ముందుకుసాగడమే జీవితం. కోట ఇప్పుడు అదే దశలో ఉన్నారు.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025