సీనియర్ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది. 50 ఏళ్ల నటన కెరీర్ కి దక్కిన గౌరవం అది. ఐతే, తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య పద్మ అవార్డు విషయంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
బసవతారకం ఆసుపత్రిలో జరిగిన తన పుట్టిన రోజు వేడుకల్లో బాలయ్య మాట్లాడారు. అవార్డులకు నేను అలంకారం కానీ అవి నాకు కావు అంటూ బాలయ్య వ్యాఖ్యానించడంతో ఆ వీడియో వైరల్ అయింది.
“నేను ఒకటే అంటాను. బిరుదలకు, ఇటువంటి వాటికి నేను అలంకారం ఏమో కానీ అవి నాకు ఎప్పుడు అలంకారం కాదంటాను. ఈ బిరుదు నాకు నటనకు ఇచ్చారు. కానీ నేను మాత్రం నా సంఘసేవకు ఇచ్చారని భావిస్తాను. సో, ఇందులో మీ (ఆసుపత్రి సిబ్బంది) భాగస్వామ్యం ఉంది,” అని బాలయ్య అన్నారు.
గతంలో ఎన్టీఆర్ కి భారతరత్న అవార్డు కాలిగోటితో సమానం అని వ్యాఖ్యానించి వివాదం రేపారు బాలయ్య.
కేంద్ర ప్రభుత్వ అవార్డులను బాలయ్య తక్కువ చేసి మాట్లాడుతుంటారు, మళ్ళీ వాటికోసం మొత్తం నందమూరి అభిమానులు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు వాటినే డిమాండ్ చేస్తుంటారు, వాటికోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు అంటూ సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More