సుదీర్ఘ విరామం తర్వాత సెట్స్ పైకి వచ్చింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్, అప్పుడెప్పుడో 2023లో జరిగింది. మళ్లీ ఇన్నేళ్లకు రెండో షెడ్యూల్ మొదలైంది.
ఈ సినిమా కోసం పవన్ భారీగా కాల్షీట్లు కేటాయించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం కొనసాగుతున్న షెడ్యూల్ ఏకంగా నెల రోజులు అంటున్నారు. మరి ఇన్ని రోజులు పవన్ కాల్షీట్లు కేటాయించగలరా అనేది ప్రశ్న.
ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. రోజూ లెక్కలేనన్ని కార్యక్రమాలు, సమావేశాలుంటాయి. రివ్యూ మీటింగ్స్ కే ఒక రోజు పడుతుంది. అలాంటి వ్యక్తి ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు ఎన్ని రోజులు సమయం కేటాయించగలరనేది డిస్కషన్ పాయింట్ గా మారింది.
పవన్ మాత్రం తన సినిమాలకు కట్టుబడి ఉన్నారు. ఇప్పటికే ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’ సినిమాల్ని పూర్తిచేసిన ఈ స్టార్, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను కూడా పూర్తిచేయాలని కృత నిశ్చయంతో ఉన్నారు. అయితే దానికి ఎన్ని రోజులు పడుతుందనేది కాలమే నిర్ణయిస్తుంది. పవన్ బిజీ షెడ్యూల్స్ ను దృష్టిలో పెట్టుకొని, కథలో చిన్నచిన్న మార్పులు చేసినట్టు తెలుస్తోంది. బాడీ డబుల్ ను కూడా ఉపయోగించబోతున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More