నటి కల్పిక గణేష్ పై కేసు నమోదు అయింది. గత నెలలో ఒక పబ్బులో ఆమె గొడవ చేసింది. ఆ తర్వాత గొడవ గురించి ఆమె మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చ చేసింది. ఇంటర్వ్యూలు ఇచ్చింది. పబ్ యాజమాన్యం తనతో తప్పుగా ప్రవర్తించారని ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఆ పబ్ యాజమాన్యం ఆమెపై కేసు వేసింది. పబ్‌లో ఆస్తికి నష్టం కలిగించారనే ఆరోపణలతో నటి కల్పికా గణేష్‌పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ నటి తమ సిబ్బందిపై అసభ్యకరమైన భాషను ఉపయోగించిందని, అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలు కూడా చేసిందని యాజమాన్యం ఆరోపించింది. మే 29న గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ లో ఈ గొడవ జరిగింది. అయితే పబ్ జనరల్ మేనేజర్ దీపక్ బజాజ్ ఫిర్యాదు మేరకు జూన్ 10న FIR నమోదు చేశారు.
“నటి కల్పిక, ఆమె మిత్రుడు కలిసి 2,200 రూపాయల బిల్లు చేశారు. తర్వాత చీజ్‌కేక్ కాంప్లిమెంటరీగా ఇవ్వాలని ఆమె పట్టుబట్టింది. మా సిబ్బంది ఆమెకి బ్రౌనీని ఇచ్చారు. కానీ ఆమె చీజ్ కేకు కావాలంటూ గొడవ చేసింది. బ్రౌనీ ప్లేట్‌ను విసిరేసి హంగామా చేసింది. మేనేజర్లను బూతులు తిట్టింది,” ఫిర్యాదులో దీపక్ బజాజ్ పేర్కొన్నారు.
గొడవ జరిగిన తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో తప్పుడు ఆరోపణలు చేసింది అని కూడా ఫిర్యాదులో పేర్కొంది పబ్ యాజమాన్యం. తనని మానసికంగా, మాటలతో పబ్ సిబ్బంది రేప్ చేశారని కల్పిక ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.
ALSO READ: ఇదివరకు తాగేదాన్ని: కల్పిక
మొత్తమ్మీద, ఒక కేకు కోసం, అదీ కూడా ఫ్రీ కేకు కోసం ఇంత గొడవ జరిగింది. చేసిన బిల్లు 2200. ఇప్పుడు వేలల్లో అటు పబ్బుకి, ఇటు కల్పిక లాయర్ల ఫీజ్ ద్వారా నష్టం.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More