39 ఏళ్ల వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకొంది. 14 ఏళ్లుగా తెలిసిన నికొలాయ్ తో ఆమె వివాహం థాయ్ ల్యాండ్ లోని క్రాబి దీవిలో జరిగింది. తాజాగా ఈ అమ్మడు తన పెళ్లి ఫోటోలను షేర్ చేసింది.
తన పెళ్లి వేడుక పూర్తయిందని ప్రకటిస్తూనే, భర్తపై ప్రేమను మరోసారి చాటుకుంది.
కథల్లో చెప్పుకునేలాంటి పెళ్లి జరిగిందని వెల్లడించింది వరలక్ష్మి. తన యువరాజు పెళ్లి చేసుకోమని తనను కోరాడని, దానికి నేను ఓకే చెప్పానని రాసుకొచ్చింది. ప్రేమలు, కేరింతలు, మంచి ఆహారం.. ఇలా ఆ పెళ్లి రోజును తను ఎప్పటికీ మరిచిపోలేనని అంటోంది.
ఈ సందర్భంగా తనను వధువుగా తయారుచేసిన సిబ్బందికి థ్యాంక్స్ చెప్పింది వరు. సెలబ్రిటీ స్టయిలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ జయలక్ష్మి సుందరేశన్.. వరలక్ష్మి పెళ్లిలో దుస్తులు, స్టయిలింగ్ బాధ్యత తీసుకుంది. ఆమె ధరించిన పెళ్లి పట్టుచీరను క్లియో సిల్క్స్ కంపెనీ తయారుచేసింది.
10వ తేదీన థాయ్ లాండ్ లోని ఓ బీచ్ రిసార్ట్ లో కొంతమంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో వరలక్ష్మి శరత్ కుమార్, నికొలాయ్ ఒక్కటయ్యారు. అయితే పెళ్లికంటే ముందే ఆమె సినిమా ప్రముఖులకు 3వ తేదీన చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటుచేసింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More