ఒక్కోసారి మేకర్స్ మరీ అమాయకత్వంగా బిహేవ్ చేస్తుంటారు. తమ సినిమాకు టాక్ తేడా వస్తే వెంటనే సినిమాకు కత్తెర్లు వేస్తారు. ట్రిమ్ చేశాం అని ప్రకటిస్తారు.
తాజాగా విడుదలైన “మిస్టర్ బచ్చన్” విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమాకు మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చేసింది. ముఖ్యంగా కొన్ని ఎపిసోడ్స్ పేలవంగా ఉన్నాయి అని రివ్యూస్ వచ్చాయి. దాంతో మేకర్స్ వెంటనే మేల్కొన్నారు. సినిమా నుంచి 13 నిమిషాలు కట్ చేశారు. ఇప్పుడు సినిమా పర్ఫెక్ట్ గా ఉంది అని అంటున్నారు.
“డబుల్ ఇస్మార్ట్” విషయంలో కూడా ఇదే జరిగినట్టు వార్తలొస్తున్నాయి కానీ ట్రిమ్మింగ్ జరిగిందనే విషయాన్ని మేకర్స్ మాత్రం బయటకు చెప్పలేదు. చాలా వల్గర్ గా ఉన్న అలీ కామెడీ ట్రాక్ ను ఫస్టాఫ్ లో ఒక చోట, సెకెండాఫ్ లో 2 చోట్ల కట్ చేసినట్టు వార్తలొస్తున్నాయి.
ట్రిమ్మింగ్ తో సినిమా టాక్ ని మార్చేస్తాం అనుకోవడం పొరపాటు. ఈ రోజుల్లో టాక్ చాలా స్పీడ్ గా వెళ్తోంది. ఒక్కసారి థియేటర్లో బొమ్మ పడిన తర్వాత ఆ టాక్ ని మార్చలేం.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More