నయనతార ఉన్నట్టుండి ధనుష్ పై ఆరోపణలు చెయ్యడం, యుద్ధం చేస్తున్నట్లు ప్రకటించడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. తాజాగా ఆమె నటిస్తున్న “రక్కేయి” అనే తమిళ చిత్రం టీజర్ విడుదలైంది. ఈ సినిమా పోస్టర్ లో నయనతార చేతిలో కొడవలి పట్టుకొని “యుద్ధం ప్రకటించింది” అంటూ చూపించారు. దాంతో, ఆమె ధనుష్ ని టార్గెట్ చేస్తూ ఈ పోస్టర్ ని విడుదల చేసినట్లు భావిస్తున్నారు.
ఇంతకీ నయనతార అంత ధైర్యంగా ధనుష్ పై ఆరోపణలు చెయ్యడానికి బలం ఎక్కడి నుంచి వచ్చింది. ఆమె వెనుకాల నిలబడ్డ శక్తులు ఎవరు? ఈ విషయంలో ఇప్పుడు రకరకాల మాటలు వినబడుతున్నాయి.
నయనతార వెనుక ఒక రాజకీయ నేత ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు, నయనతార బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమెకి కొన్ని మహిళా సంఘాలు, ఫెమినిస్ట్ సంఘాల మద్దతు దొరికింది అని, అప్పటి నుంచి ఆమె ఇలా మారింది అని అంటున్నారు. అదీ కాకుండా ధనుష్ “బాధితుల” లిస్ట్ కూడా పెద్దదే అనే మాట వినిపిస్తోంది. ధనుష్ పై నయనతారకి మిగతా హీరోయిన్ల నుంచి సపోర్ట్ రావడానికి కారణమే అదే అని ఒక ప్రచారం.అందులో నిజమెంత అనేది కాలమే నిర్ణయిస్తుంది.
ధనుష్ … రజినీకాంత్ కూతురుకి డివోర్స్ ఇవ్వడంతో సూపర్ స్టార్ నుంచి మద్దతు లేదు. దాంతో, నయనతార ధైర్యం చేసినట్లు భావిస్తున్నారు. ధనుష్ కనుక రజినీకాంత్ అల్లుడిగానే ఉండి ఉంటే నయన్ అలాంటి ఆరోపణలు చేసేందుకు జంకేది అని అంటున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More