హీరోయిన్ తేజస్వి మడివాడ ఇప్పుడు వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఆమె సినిమాలల్లో నటించి చాలా కాలమే అయింది. ఐతే, సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికీ పాపులర్. ముఖ్యంగా ఆమె పోస్ట్ చేసే బికినీ ఫోటోలు, గ్లామర్ సోయగాల కారణంగా క్రేజ్ కంటిన్యూ అవుతోంది.
అలాగే అడపాదడపా వెబ్ షోలలో కనిపిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ భామ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను వెల్లడించింది. తాను చాలా మందిని ప్రేమించిన మాట వాస్తవమే అని అంగీకరించింది. డేటింగ్ లో చాలా ఎక్సపీరియెన్స్ ఉంది అని చెప్పింది తేజస్వి.
కానీ తాను మోసపోయాను అని, ఆ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకొని ఇప్పుడు జాగ్రత్తగా ఉంటున్నాను అని చెప్తోంది. తాను ముగ్గురితో మోసపోయాను అని వెల్లడించింది. “గతంలో ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ నన్ను బాగా వాడుకొని వదిలేశారు,” అని చెప్పింది.
అయినా ప్రేమ మీద నమ్మకం పోలేదు అని అంటోంది తేజస్వి. పెళ్లి చేసుకోవడం ఖాయం కానీ ఆచితూచి నిర్ణయం తీసుకుంటుందట.
అలాగే సినిమా ఇండస్ట్రీలో తనకు ఒకరు, ఇద్దరు రియల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని అంటోంది. 33 ఏళ్ల ఈ తెలుగు భామకి ఇప్పుడు జ్ఞానోదయం అయిందా లేక కాంట్రవర్సియల్ గా మాట్లాడితేనే జనం తన ఇంటర్వ్యూలు చూస్తారని అనుకుందో తెలియదు కానీ ఈ భామ తన బోల్డ్ శైలికి తగ్గట్లే అనేక విషయాలు ఓపెన్ గా చెప్పింది.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More