సమంతను సిల్వర్ స్క్రీన్ పై చూసి చాన్నాళ్లయింది. అప్పుడెప్పుడో వచ్చిన ‘ఖుషి’ సినిమా తర్వాత మళ్లీ ఆమె వెండితెరపై కనిపించలేదు. ఈ గ్యాప్ లో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది. కోలుకున్న తర్వాత ఓటీటీకి పరిమితమైంది.
అలా వెండితెరకు లాంగ్ గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ, ఎట్టకేలకు తెరపైకొచ్చింది. స్వీయ నిర్మాణంలో సమంత గెస్ట్ రోల్ పోషించిన ‘శుభం’ సినిమా థియేటర్లలోకి వచ్చింది. సినిమాకి ప్రశంసలు దక్కాయి. ఆ సంగతి పక్కనపెడితే, ఆమెను చూడడం కోసం ఓ సెక్షన్ ఆడియన్స్ థియేటర్లకు వచ్చారు.
అలా వచ్చిన ప్రేక్షకుల్ని నిరాశపరిచింది సమంత. సినిమా ఇంటర్వెల్ కు ముందు 2 సన్నివేశాల్లో కనిపించిన సమంత, ఆ తర్వాత మరోసారి మెరుస్తుంది. మొత్తంగా సినిమా మొత్తంలో 10 నిముషాలు కూడా లేదు ఆమె పాత్ర. మరీ ఇంత చిన్న పాత్రలో కనిపించడం ఏంటి అని ఆమె అభిమానులు హర్ట్ అయినట్లు ఉన్నారు.
గ్యాప్ ఇచ్చి వచ్చిన తర్వాత ఎవరైనా తమ రీఎంట్రీని ఘనంగా చాటాలనుకుంటారు. సమంత కూడా అలా గట్టిగా బౌన్స్ బ్యాక్ అవుతుందని ఆమె ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ ఇలా న గెస్ట్ ఎప్పీరయెన్స్ సీన్స్ తో ఆమె సిల్వర్ స్క్రీన్ పైకి రావడం చాలామందిని నిరాశపరించింది.
ALSO READ: Subham Review: A satire wrapped in a ghost story
ఐతే ఆమె పూర్తి స్థాయి హీరోయిన్ గా వచ్చే నెల నుంచే కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టనుంది.
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More
అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More
ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More