విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఆయన కొత్త సినిమాల పోస్టర్లు విడుదల అయ్యాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ “కింగ్ డమ్” సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మే 30న విడుదల కావాలి. ఐతే, ప్రస్తుతం పాకిస్తాన్, ఇండియా మధ్య ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆ తేదికి విడుదల చెయ్యాలా వద్దా అనే డైలమా ఉంది మేకర్స్ కి.
ఇక విజయ్ దేవరకొండ తదుపరి చెయ్యబోయే రెండు సినిమాల పోస్టర్లు విడుదల అయ్యాయి.
VD 14
విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ కాంబోలో రానున్న చిత్రం (VD 14)కి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. బ్రిటీష్ కాలం నేపథ్యంగా సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో విజయ్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించనుంది. ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.
VD 15
దిల్ రాజు సంస్థ నిర్మించే కొత్త సినిమాలో కూడా విజయ్ నటిస్తున్నాడు. ఈ సినిమాకి రవికిరణ్ కోలా దర్శకుడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ సినిమా ప్రేమ, హింస చుట్టూ తిరుగుతుంది.
మరోవైపు, ఇండియన్ ఆర్మీకి విరాళం ప్రకటించారు విజయ్ దేవరకొండ. క్లాత్ బ్రాండింగ్ రౌడీ వేర్ అమ్మకాల్లో వచ్చే లాభాల్లోని కొంత వాటాను భారత సైన్యానికి విరాళం ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు మేడ్ ఫర్ ఇండియా అంటూ తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా షేర్ చేశారు విజయ్ దేవరకొండ. కొన్ని వారాల పాటు సాగే అమ్మకాల్లో నుంచి ఈ మొత్తం తీసి ఆర్మీకి ఇస్తారు.
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More
అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More
ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More