‘రాబిన్ హుడ్’…దొంగతనాల నేపథ్యంలో వస్తున్న సినిమా ఇది. అప్పుడెప్పుడో వచ్చిన ‘కొండవీటి దొంగ’ సినిమా నుంచి, ఇంకా చెప్పాలంటే అంతకంటే ముందు నుంచి ఈ తరహా కథలు/సినిమాలు చూస్తూనే ఉన్నాం.
అలాంటి రొటీన్ కథతో నితిన్ ఇప్పుడు ఫ్రెష్ గా సినిమా చేశాడు. మరి ఈ తరం ఆడియన్స్ కు దర్శకుడు వెంకీ కుడుముల ఈ కథతో ఏం చూపించబోతున్నాడు. ఇందులో ఎంత కొత్తదనం ఉంటుంది?
దీనిపై క్లియర్ గా స్పందించాడు దర్శకుడు. చెడ్డవాళ్ల నుంచి దోచుకొని, మంచివాళ్లకు పంచి పెట్టే ‘దొంగ’ కథలు గతంలో చాలా వచ్చాయని అంగీకరించిన దర్శకుడు.. అది గుర్తుపెట్టుకొని ‘రాబిన్ హుడ్’ కథ రాశానంటున్నాడు.
‘రాబిన్ హుడ్’ కథను కేవలం దొంగ కథగా చూడొద్దంటున్నాడు కుడుముల. సినిమా మొదలైన 20 నిమిషాలకే కథ మొత్తం మారిపోతుందని, స్క్రీన్ ప్లే విషయంలో ప్రయోగాత్మకంగా వెళ్లానని చెబుతున్నాడు. నితిన్-శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా, డిసెంబర్ 25న రిలీజ్ అవుతోంది.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More