రామ్ గోపాల్ వర్మ మరో షాక్ ఇచ్చాడు. తను అస్సలు ఎక్కడికీ పారిపోలేదని, తన డెన్ లోనే ఉన్నానంటూ బాంబ్ పేల్చాడు. పోలీసులు వచ్చినప్పుడు కూడా తను డెన్ లోనే ఉన్నానని, కానీ వాళ్లు తనను అరెస్ట్ చేయడానికి రాలేదని క్లారిటీ ఇచ్చాడు.
“నేను ఏదో పరారీలో ఉన్నాను , మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపదుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్. ఈ టైమ్ అంత నేను నా డెన్ ఆఫీసు లోనే ఉన్నాను, అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకి వెళ్ళడం తప్ప.
ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంత వరకు నా ఆఫీసు లోకి కాలే పెట్టలేదు.. పైగా నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియా తో కానీ చెప్పలేదు. ఒకవేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసు లోకి ఎందుకు రారు?”
ఇలా సడెన్ గా ట్విట్టర్ లోకొచ్చి బాంబ్ పేల్చాడు వర్మ. నలుగురు వేర్వేరు వ్యక్తులు, ఏపీలోని 4 జిల్లాల్లో వేర్వేరుగా కేసులు పెట్టడం తనకు ఆశ్చర్యంగా ఉందన్నాడు వర్మ. తను ఏడాది కిందట పెట్టిన పోస్టుకు ఇప్పుడు వాళ్ల మనోభావాలు దెబ్బతినడం ఏంటో అర్థం కావడం లేదన్నాడు.
తను జీవితంలో ఎవ్వరికీ భయపడనంటూ ఇప్పటికే వీడియో రిలీజ్ చేసిన ఈ దర్శకుడు.. ఏకబిగిన పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలిచ్చాడు. ఆ తర్వాత తన కేసుపై సోషల్ మీడియాలో సుదీర్ఘంగా స్పందించాడు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More