పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రమాదవశాత్తూ గాయపడిన సంగతి తెలిసిందే. షూటింగ్ స్పాట్ లో ఆయన కాలికి దెబ్బ తగిలింది. దీంతో అన్ని షూటింగ్స్ తాత్కాలికంగా నిలిచిపోయాయి. వాటితో పాటు ‘కల్కి’ సినిమా ప్రచారంపై కూడా ఆ ప్రభావం పడింది.
వచ్చేనెల 3వ తేదీన జపాన్ లో ‘కల్కి’ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రచారం కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ తో కలిసి ప్రభాస్ టోక్యో వెళ్లాల్సి ఉంది. కానీ గాయం కారణంగా ఈ ప్రచారానికి అతడు దూరమయ్యాడు.
దీంతో జపాన్ లోని తన ఫ్యాన్స్ కు సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు ప్రభాస్. తన కాలికి దెబ్బ తగలడంతో ప్రయాణం చేయలేనని స్వయంగా వెల్లడించిన ప్రభాస్, త్వరలోనే జపాన్ ఫ్యాన్స్ ను కలుస్తానంటూ భరోసా ఇచ్చాడు.
వీడియో అంతా ఒకెత్తయితే, చివర్లో జపనీస్ భాషలో ప్రభాస్ మాట్లాడ్డం మరో ఎత్తు. ‘కల్కి’ సినిమాను ఎంజాయ్ చేయండంటూ జపనీస్ లో చెప్పాడు ప్రభాస్. దీంతో జపాన్ లో అతడి అభిమానులు ఫిదా అవుతున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More