దర్శకుడు అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. షారుక్ ఖాన్ తో ‘జవాన్’ తీసిన తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తాడని భావించారు. కానీ అల్లు అర్జున్ తో చేసిన చర్చలు ఫలించలేదు. దాంతో, అట్లీ ఒక భారీ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. అది సల్మాన్ ఖాన్ తో ఉంటుంది అని మీడియా భావిస్తోంది.
“మీరు అనుకుంటున్నవి నిజం కావొచ్చు. కానీ మీరు ఊహించని విధంగా కాస్టింగ్ ఉంటుంది. ఒక్క మాట ఐతే చెప్పగలను నా తదుపరి చిత్రం ఇండియా గర్వించేవిధంగా ఉంటుంది. మీరు ఆశ్చర్యపోయే నటులు ఉంటారు. ఆ దిశగా ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. రెండు, మూడు వారాల్లో అంతా సెట్ అవుతుంది,” ఇలా తన కొత్త సినిమా గురించి చెప్పాడు అట్లీ.
తెలుగుసినిమా.కామ్ కి తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం… అట్లీ మల్టీస్టారర్ సినిమా తీయబోతున్నాడు. సల్మాన్ ఖాన్ తో పాటు ఇద్దరు హాలీవుడ్ నటులు, ఇద్దరు దక్షిణ భారతీయ హీరోలు నటిస్తారు. ఆ నటుల పేర్లు ఫైనలైజ్ అయితే ఈ సినిమా “బాప్ ఆఫ్ మల్టీస్టారర్” అవుతుంది అని చెప్పొచ్చు.
తమిళంలో వరుసగా విజయ్ తో మూడు బ్లాక్ బస్టర్స్ తీశాడు అట్లీ. బాలీవుడ్ లో మొదటి ప్రయత్నమే… షారుక్ ఖాన్ నటించిన జవాన్. అది రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు మరింత భారీ చిత్రం సెట్ చేస్తున్నాడు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More