న్యూస్

రణ్వీర్ నో, ప్రభాస్ ఎస్?

Published by

“హను మాన్” సినిమా హిట్ కాగానే దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ సినిమా, ఈ సినిమా అంటూ అనేక ప్రకటనలు చేశాడు. “జై హను మాన్”, “మోక్షజ్ఞ నందమూరి మొదటి సినిమా”, రణ్వీర్ సింగ్ తో “బ్రహ్మ రాక్షస్”, ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ… ఇలా హంగామా చేశాడు. కానీ అందులో ఏవీ మొదలు కాలేదు.

మోక్షజ్ఞ సినిమా ఉందో లేదో తెలియని సందిగ్ధంలో పడింది. “జై హను మాన్” షూటింగ్ కి టైం ఇచ్చేందుకు రిషబ్ శెట్టి వద్ద ఇప్పుడు డేట్స్ లేవు. రణ్వీర్ సింగ్ “బ్రహ్మ రాక్షస్” చిత్రాన్ని ఆపేశాడు.

దాంతో కొన్నాళ్ళూ ప్రశాంత్ వర్మ దాదాపుగా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఐతే, ఇప్పుడు అతనికి ప్రభాస్ పిలిచి తన సినిమా ఆఫర్ ఇచ్చాడు. రణ్వీర్ సింగ్ ఆపేసియాన్ “బ్ర‌హ్మరాక్ష‌స్‌”ని ప్రభాస్ తో చేస్తున్నాడు అని టాక్.

ఈ రోజు ప్ర‌భాస్ పై లుక్ టెస్ట్ కూడా జరిగింది అని అంటున్నారు. ఈ సినిమాని “కేజీఎఫ్”, “సలార్” నిర్మించిన హోంబలే సంస్థ నిర్మిస్తోంది. మొత్తానికి ప్రభాస్ ఎస్ చెప్పడంతో ప్రశాంత్ వర్మకి డిప్రెషన్ పోయింది. మళ్ళీ ఉత్సాహం వచ్చింది.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025