పవన్ కళ్యాణ్ నటించిన “హరి హర వీర మల్లు” సినిమా విడుదలకు ఇబ్బంది పడుతోంది. మొన్నటి వరకు షూటింగ్ పూర్తికాక నిర్మాత ఏ.ఎం.రత్నం తిప్పలు పడ్డారు. ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకొని జూన్ 12న విడుదల కావాల్సిన టైంలో ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. దానికి అనేక కారణాలు. ప్రధానమైనది … గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం కావడం. అంతకన్నా ప్రధానమైనది… ఈ సినిమా కోసం తీసుకున్న అప్పులు, అంతకుముందు నిర్మించిన సినిమాల మీద ఉన్న బకాయిలు తీర్చడం.
అదే నిర్మాత రత్నంకున్న పెద్ద సమస్య. థియేటర్ హక్కులు అమ్మితే ఈ సినిమా సమస్యలు చాలావరకు సమసిపోతాయి. కానీ, నిర్మాత అడిగే రేటు, బయ్యర్లు చెపుతున్న రేటు మధ్య బేరం కుదరడం లేదు.
పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఇప్పటివరకు ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. నాలుగేళ్ల క్రితం 11 కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. ఆ 11 కోట్లు కూడా నిర్మాతకు కలిసి వచ్చి సినిమా విడుదల సాఫీగా అవుతుంది. అంటే… 11 కోట్లు పవన్ తిరిగి ఇస్తే… సినిమా మొత్తం ఫ్రీగా చేసినట్లే.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More