అవీ ఇవీ

ఇదివరకు తాగేదాన్ని: కల్పిక

Published by

నటి కల్పిక గణేష్ ఇటీవల ఒక పబ్ లో గొడవచేసి వార్తల్లో నిలిచింది. తెగ తాగి అలా అల్లరి చేసింది అని మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడింది. నేను ఆ రోజు పబ్ లో తాగలేదు అని చెప్పింది.

మరి పబ్ కి తాగడానికి కాకుండా దేనికోసం వెళ్తారు? అదీ కూడా రెగ్యులర్ గా? నేను పబ్ కి రెగ్యులర్ కస్టమర్ ని అనే ఆమె ఆ రోజు గొడవలో చెప్పుకొంది. మరి తాగడానికి కాకుండా పబ్ కి ఎందుకు వెళ్తోంది అనే డౌట్ మనకి వస్తుంది కదా. దానికి ఆమె వివరణ ఇచ్చింది.

“అవును నేను ఇదివరకు తాగేదాన్ని. మా ఇంట్లో కూడా తెలుసు. కానీ కొంతకాలంగా తాగడం లేదు. ఆల్కహాల్ తీసుకోవడం మానేశా,” అని వివరణ ఇచ్చింది.

ఐతే, కల్పిక గణేష్ వివరణ ఎలా ఉన్నా.. ఆ పబ్ లో గొడవతో ఈ భామ ఒక్కసారిగా ఫేమస్ అయింది. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” “హిట్”, “యశోద” వంటి సినిమాల్లో నటించింది. కానీ సినిమాలలో పాత్రల కన్నా ఈ పబ్ గొడవతో ఎక్కువ పాపులర్ అయిన మాట నిజం.

Recent Posts

వాసు మాట బన్నీ వింటాడా?

హీరో అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహిత మిత్రుడు ఉదయ శ్రీనివాసు. ఎవరీ ఉదయ శ్రీనివాసు అనే డౌట్ వస్తుందా?… Read More

June 6, 2025

ఇక అలాంటివి వద్దు: సూర్య

సూర్యకి తాజాగా జ్ఞానోదయం అయింది. కమల్ హాసన్ లా, విక్రమ్ లా కొన్నాళ్ళూ గెటప్ ల పిచ్చిలో పడి కొన్ని… Read More

June 5, 2025

అప్పుడు శంకర్, ఇప్పుడు రత్నం

కమల్ హాసన్ చాలా ఏళ్ళు హిట్ లేక ఇబ్బందిపడ్డారు. ఒకవిధంగా చెప్పాలంటే అప్పులు, ఆర్థిక కష్టాలతో సతమతం అయ్యారు. వాటి… Read More

June 5, 2025

ఆ దర్శకుడు తొడల సైజ్ అడిగాడు

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది కామన్ గా కనిపిస్తోంది. క్రేజ్ లో ఉన్న హీరోయిన్లు దీని గురించి మాట్లాడరు. అవకాశాలు… Read More

June 5, 2025

ప్రభాస్ ను బాగా ఇబ్బంది పెట్టాను

'కన్నప్ప' సినిమా విషయంలో ప్రభాస్ ను బాగా ఇబ్బంది పెట్టినట్టు వెల్లడించాడు మంచు విష్ణు. మరీ ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో… Read More

June 5, 2025

మిగతా సినిమాలపైనే ఆశలు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి యాక్షన్ హీరోగా గుర్తింపు ఉంది. తెలుగులో ఎనిమిది సినిమాలు వరుసగా చేశాక హిందీలో తన… Read More

June 4, 2025