బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి యాక్షన్ హీరోగా గుర్తింపు ఉంది. తెలుగులో ఎనిమిది సినిమాలు వరుసగా చేశాక హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని బాలీవుడ్ వెళ్ళాడు. “ఛత్రపతి” అనే సినిమా హిందీలో చేస్తే అది ఘోరమైన పరాజయం అయింది. దాంతో బాలీవుడ్ కెరీర్ వదిలేసి మళ్ళీ తెలుగులోకి వచ్చాడు.
తెలుగులో రాగానే వరుసగా సినిమాలు చేశాడు. అందులో ముందుగా ఒప్పుకున్న చిత్రం “భీమ్లా నాయక్” దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్షన్లో “టైసన్ నాయుడు.” ఐతే, ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ముందుకు కదలడం లేదు. ఈ గ్యాప్ లో “భైరవం”, “హైందవ”, “కిష్కింధపుర” వంటి సినిమాలు ఒప్పుకున్నాడు. మొత్తంగా నాలుగు చిత్రాలు. ఇందులో “భైరవం” గత వీకెండ్ విడుదలైంది.
ఇక “హైందవ”, “కిష్కింధపుర”, “టైసన్ నాయుడు” చిత్రాలు విడుదల కావాలి. “భైరవం” ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మిగతా మూడు సినిమాలపైనే ఇక ఆశలు.
కథాబలం ఉన్న సినిమాలు చెయ్యడమే కాదు తన పాత్రకు దమ్ముండేలా చూసుకుంటేనే బెల్లంకొండ సాయికి హీరోగా కెరీర్ బాగుంటుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More