నితిన్ హీరోగా నటించిన “రాబిన్ హుడ్” చిత్రం ఎట్టకేలకు కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 28న విడుదల కానుంది. వేసవి సెలవుల ప్రారంభంలోనే రానుంది.
నిజానికి ఈ డేట్ ని మొదట విజయ్ దేవరకొండ చిత్రానికి లాక్ చేశారు. ఆ తర్వాత ఆ డేట్ కే తమ సినిమా వస్తుంది అని ఇప్పటిదాకా “హరి హర వీర మల్లు” నిర్మాతలు ప్రకటిస్తూ వచ్చారు. కానీ సడెన్ గా “రాబిన్ హుడ్” నిర్మాతలు మార్చి 28న తమ సినిమా విడుదల అని ప్రకటించారు. అంటే, “హరి హర వీర మల్లు” ఆ డేట్ కి రావడం లేదని అర్థం.
పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తోంది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. పైగా హీరో నితిన్ పవన్ కళ్యాణ్ కి అభిమాని. సో, తమ సినిమా డేట్ ప్రకటించేముందు పవన్ కళ్యాణ్ సినిమా ఆ డేట్ కి రావడం లేదని ముందే తెలుసుకొని, ఖరారు చేసుకొని ఉంటారు. అందుకే, ఉగాది కానుకగా “రాబిన్ హుడ్”ని తెస్తున్నారు.
మరి పవన్ కళ్యాణ్ సినిమాకి ఏ డేట్ ప్రకటిస్తారో అనేది చూడాలి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More