‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో అదరగొట్టాడు బాలనటుడు రేవంత్. “నిన్ను కొరికేస్తా..కొరికేస్తా నిన్ను” అంటూ సందడి చేసిన ఈ చిచ్చర పిడుగు, ఉన్నఫలంగా తెలుగుతెరపైకి ఊడిపడ్డాడు. ఇంతకీ ఈ 9 ఏళ్ల పిల్లాడికి సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీకి ప్రచారం చేశాడు ఈ బుడతడు. ఈవీఎం డమ్మీ మెషీన్ పట్టుకొని ఇంటింటికీ తిరుగుతూ, గాజు గ్లాసు గుర్తు పక్కన ఉన్న బటన్ నొక్కాలంటూ ప్రచారం చేశాడు. జనసైనికులు విపరీతంగా షేర్ కొట్టడంతో, ఆ వీడియో ఇనస్టాగ్రామ్ లో వైరల్ అయింది.
అలా రౌండ్స్ కొడుతూ అనీల్ రావిపూడి కంట్లో పడింది. గోదావరి యాసలో ముద్దుగా మాట్లాడుతున్న రేవంత్, అనీల్ రావిపూడిని అమితంగా ఆకర్షించాడు. అప్పుడే తన సినిమాలో ఓ బుడతడి రోల్ కోసం ప్రయత్నిస్తున్నాడు అనీల్. దీంతో ఆ పిల్లాడి కోసం అన్వేషణ మొదలుపెట్టాడు.
4-5 రోజుల పాటు వాళ్లనీవీళ్లని అడిగి మొత్తానికి పిల్లాడి తండ్రి ఫోన్ నంబర్ సంపాదించారు. ఊహించని విధంగా వచ్చిన సినిమా ఛాన్స్ తో కుటుంబమంతా ఉబ్బితబ్బిబ్బయింది. అలా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోకి వచ్చాడు రేవంత్.
షూటింగ్ లో అతడి ఫస్ట్ డైలాగ్ ఏంటో తెలుసా.. “మా నాన్న వేసేదే నాజూగ్గా 2 స్టెప్పులు, ఒళ్లు కదలకుండా, భూమి అదరకుండా ఓ పోజెట్టి ఇట్టా ఇట్టా అంటాడు. దానికే అప్పడాలు ఒడియాలు అయిపోతాయా ఏంటి?” సినిమాలో సూపర్ హిట్టయిన డైలాగ్స్ లో ఇది కూడా ఒకటి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More