న్యూస్

చీకట్లో కొట్టాను కానీ!

Published by

మీడియా ప్రతినిధిని కొట్టిన విషయాన్ని మోహన్ బాబు అంగీకరించారు. ఆ చీకట్లో అలా జరిగిపోయిందన్నారు. తను చాలా బాధపడుతున్నానని అన్నారు.

“ఆ చీకట్లో అలా జరిగింది వాస్తవమే. మైక్ లాక్కోవడం, వాడు నాపై  కేకలు వేశాడు. ఆ వేడిలో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతడికి తగిలి ఉండొచ్చు. నేను హృదయపూర్వకంగా బాధపడుతున్నాను. ఈరోజుకీ నేను బాధపడుతున్నాను. అలా ఆవేదనకు గురై నేను కూడా హాస్పిటల్ లో చేరాను. సినిమాల్లో నటిస్తాను తప్ప, నిజజీవితంలో నేను నటించాల్సిన అవసరం లేదు.”

తన ఇంటి గేటు బయట ఎవర్నయినా కొట్టనట్టయితే అది తప్పు అవుతుందని, అప్పుడు తనపై వంద కేసులు పెట్టినా ఒప్పుకుంటానని తెలిపిన మోహన్ బాబు.. ఇంటి గేటు తోసుకొని లోపలకొచ్చి,  తన మనశ్శాంతిని భంగం చేశారని ఆరోపించారు.

“నేను కొట్టడం తప్పు, కానీ ఏ సందర్భంలో కొట్టాల్సి వచ్చిందో మీరే ఆలోచించాలి. నేను కొట్టానని చెబుతున్నారు కానీ, అంతకంటే ముందు మైక్ తీసి నా నోట్లో పెట్టిన విషయం చెప్పడం లేదు. నా కన్ను పోవాల్సింది. నిజంగా నా కన్నుపోతే నేను కేసులు పట్టే పరిస్థితి వచ్చేది. కంటి కింద చిన్న దెబ్బతో నేను ఎస్కేప్ అయ్యాను. లేదంటే నా జీవితం గుడ్డిదయ్యేది.”

లోపలకు దూసుకొచ్చిన వాళ్లంతా మీడియా ప్రతినిధులేనా కాదా అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు మోహన్ బాబు. ఏదేమైనప్పటికీ అలా చేయిచేసుకోవడం తప్పేనంటూ బాధపడ్డారు.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025