న్యూస్

రాజాసాబ్ లో చాలా ప్రత్యేకం: మాళవిక

Published by

‘రాజాసాబ్’ సినిమాలో మెయిన్ హీరోయిన్ రోల్ పోషిస్తోంది మాళవిక మోహనన్. ప్రభాస్ సినిమాలో హీరోయిన్ కు ఎలాంటి ట్రీట్ మెంట్ ఉంటుందో అందరికీ తెలిసిందే కదా.. రకరకాల ఆహార పదార్థాలతో ముంచెత్తుతాడు ప్రభాస్. తన హీరోయిన్లను మహారాణిలా చూసుకుంటాడు, అతిథి సత్కారాల్లో ఏమాత్రం లోటు చేయడు.

ఆ అనుభవాన్ని తను కూడా చవిచూశానంటోంది మాళవిక. సెట్స్ లో ప్రభాస్ పెట్టే భోజనం తినలేకపోయానని చెప్పుకొచ్చింది. తన జీవితంలో అమ్మ చేతి వంట తర్వాత ఆ స్థాయిలో ఎంజాయ్ చేసిన ప్రభాస్ పెట్టిన భోజనాన్ని ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చింది.

‘సాహో’ టైమ్ లో శ్రద్ధా కపూర్ కు, ‘సలార్’లో శృతిహాసన్ కు, కల్కి’లో దీపిక పదుకోన్ కు ప్రభాస్ అతిథి మర్యాదల గురించి బాగా తెలుసు. శృతిహాసన్ అయితే సందర్భం దొరికితే చాలు ప్రభాస్ భోజనాల గురించి చెబుతుంటుంది. ఇప్పుడీ లిస్ట్ లోకి మాళవిక కూడా చేరిపోయింది.

అన్నట్టు ‘రాజాసాబ్’లో తన పాత్రపై స్పందించింది ఈ బ్యూటీ.

సినిమాలో తన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని, ఎవ్వరూ గెస్ చేయలేరని ఛాలెంజ్ చేస్తోంది. భవిష్యత్తులో మళ్లీ అలాంటి పాత్ర తనకు దక్కదని కూడా అంటోంది.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025