మొన్నటివరకు నాగచైతన్య, శోభిత పెళ్లి కార్డు వైరల్ అయింది. ఇప్పుడు కీర్తి సురేష్ వంతు వచ్చింది. మరికొన్ని రోజుల్లో ఈమె తన ప్రియుడు ఆంటోనీ తటిల్ ను పెళ్లాడబోతోంది. వాళ్ల పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వెడ్డింగ్ కార్డు ప్రకారం, కీర్తి సురేష్ ఈ నెల 12న పెళ్లి చేసుకోబోతోంది. అది కూడా గోవాలో. రెండు సంప్రదాయాల్లో కీర్తిసురేష్ పెళ్లి జరుగుతుంది. ముందుగా హిందూ సంప్రదాయంలో కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి చేసుకుంటారు. దీని కోసం గోవాలో ఓ లగ్జరీ రిసార్ట్ ను వాళ్లు బుక్ చేశారు. ఆల్రెడీ పనులు కూడా మొదలయ్యాయి.
రిసార్ట్ లో పెళ్లి వేడుక పూర్తయిన వెంటనే సాయంత్రానికి నార్త్ గోవాలోని ఓ పురాతన చర్చికు చేరుకుంటారంతా. అక్కడ క్రిస్టియన్ పద్ధతిలో కీర్తి సురేష్ ను వివాహం చేసుకుంటాడు ఆంటోనీ. ఆమె చేతికి రింగ్ తొడికి కిస్ ఇస్తాడు.
ఇలా ఒకే రోజు రెండు సార్లు కీర్తిసురేష్ పెళ్లి చేసుకోబోతోంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతానని ఆమె ఇదివరకే ప్రకటించింది. ఆల్రెడీ ఓ హిందీ సినిమా పూర్తి చేసింది. పెళ్లి తర్వాత మరో బాలీవుడ్ ప్రాజెక్టు చేస్తానని తెలిపింది.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More