సీనియర్లలో ఒకేసారి 2, 3 సినిమాలు ప్రకటించే హీరోలు చాలా తక్కువ. నాగార్జున దాదాపు సినిమాలు తగ్గించేశారు. వెంకటేష్ ఒక సినిమా పూర్తయిన తర్వాత మాత్రమే మరో సినిమా టేకప్ చేస్తారు. అది కూడా గ్యాప్ ఇచ్చి. ఇక బాలకృష్ణ గ్యాప్ ఇవ్వరు కానీ, ఒకటి పూర్తయిన తర్వాతే ఇంకోటి.
కానీ చిరంజీవి అలా కాదు. ఒకేసారి 2-3 సినిమాలు ప్రకటిస్తాడు. చకచకా పూర్తిచేస్తారు. అది ఆయన స్టయిల్. ఇప్పుడు మరోసారి మెగా లైనప్ సిద్ధమైంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాబోతున్నాయి.
ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు చిరంజీవి. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తయిన వెంటనే ”దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు చిరంజీవి. మరో హీరో నాని, ఈ ప్రాజెక్టుకు ప్రజెంటర్ గా వ్యవహరిస్తాడు.
అలాగే ప్రస్తుతం వెంకటేష్ హీరోగా “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా తీస్తున్న అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇలా వరుసగా సినిమాలు ఎనౌన్స్ చేస్తూ మరోసారి బిజీ అయిపోయారు చిరంజీవి.
అయితే ఈ లైనప్ లో కూతురు నిర్మాతగా చేయాల్సిన సినిమా మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More