చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై మెగా ఫ్యాన్స్ భగ్గుమన్నారు. కనకమేడల కూడా దిగొచ్చాడు. క్షమాపణలు చెప్పాడు. అయితే ఇక్కడ మేటర్ అది కాదు.
అతడు క్షమాపణలు చెప్పడానికి సరిగ్గా 48 గంటల ముందు ఓ ప్రకటన చేశాడు. త్వరలోనే చిరంజీవితో ఓ సినిమా చేస్తాననేది అతడి ప్రకటన సారాంశం. చిరంజీవితో “ఠాగూర్” తరహా సినిమా తీస్తానని, వినోదంతో పాటు మంచి సందేశం, యాక్షన్ అందులో ఉంటాయని ఆయన ప్రకటించుకున్నాడు.
ప్రస్తుతం తన టీమ్ ఆ పనిలోనే ఉందని, త్వరలోనే చిరంజీవిని కలిసి కథ వినిపిస్తానని అన్నాడు. అతడు ఆ స్టేట్ మెంట్ ఇచ్చిన 2 రోజులకే, అతడి పాత ట్వీట్ వైరల్ అవ్వడం, మెగా ఫ్యాన్స్ భగ్గుమనడం చకచకా జరిగిపోయాయి.
ఇంత జరిగిన తర్వాత విజయ్ కనకమేడలకు చిరంజీవి అవకాశం ఇస్తారా.. రామ్ చరణ్ రానిస్తాడా.. ఇలా ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. మెగా ఫ్యాన్స్ మాత్రం విజయ్ కనకమేడలను కాంపౌండ్ లోకి అడుగుపెట్టనీయొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు.
విజయ్ కనకమేడల “నాంది” అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నరేష్ తో మరో సినిమా తీస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు “భైరవం” అనే సినిమా తీశాడు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఇలా ఇరకాటంలో పడ్డాడు.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More
పవన్ కల్యాణ్ లో నటుడు మాత్రమే కాదు.. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, లిరిసిస్ట్ కూడా… Read More