కంగనా రనౌత్ నటించి, దర్శకత్వం వహించిన “ఎమెర్జెన్సీ” చిత్రం ఎట్టకేలకు వెలుగు చూడనుంది. ఇందిరాగాంధీ విధించిన “ఎమెర్జెన్సీ” కాలంపై కంగనా సంధిస్తున్న రాజకీయ బాణం ఇది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ బీజేపీ ఎంపీ తీసిన సినిమాకి సాధారణంగా ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. కేంద్రంలో ఉన్నది బీజేపీనే. ఈ సినిమాకి కేంద్ర ప్రభుత్వం ఎర్ర తివాచీ వెయ్యాలి. కానీ అలా జరగలేదు.
ఎందుకో, ఈ సినిమాకి సెన్సార్ అభ్యంతరాలు వచ్చాయి. అనేక సన్నివేశాలను తొలగించాలి, లేదా మార్పులు చెయ్యాలని అని సెన్సార్ బోర్డు పట్టుపట్టింది. దాంతో, కంగనా తన సినిమాని వాయిదా వేసింది. నాలుగు నెలల పాటు “కరెక్షన్లు” చేసింది కంగనా. ఇక ఇప్పుడు ఈ సినిమాకి విడుదల తేదీ దక్కింది.
రిపబ్లిక్ డేని టార్గెట్ చేస్తూ కంగనా ఈ సినిమాకి జనవరి 17, 2025ని విడుదల తేదీగా ఖరారు చేసింది.
కంగనా డైరెక్ట్ చేసిన రెండో చిత్రం ఇది. ఇంతకుముందు “మణికర్ణిక” సినిమా తీసింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More