న్యూస్

4 రోజులకే బ్రేక్ ఈవెన్

Published by

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమా దీపావళి విన్నర్ గా అవతరించింది.

మరో 3 సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ, వాటి కంటే ముందుగా బ్రేక్ ఈవెన్ అయి హిట్ అనిపించుకుంది. విడుదలైన 4 రోజులకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం.

మిస్టిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీనికితోడు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ టికెట్ రేట్లకే సినిమాను ప్రదర్శించడం కలిసొచ్చింది. అలా ‘క’ సినిమా ఏకథాటిగా 3 రోజుల పాటు హౌజ్ ఫుల్స్ తో నడిచింది. ఫలితంగా బ్రేక్ ఈవెన్ సాధ్యమైంది.

ALSO READ: ‘Ka’ breaks even and sets for profits

విడుదలకు ముందు 80కి పైగా వేసిన పెయిడ్ ప్రీమియర్ స్క్రీనింగ్స్ తో కలిపి ఈ ఘనత సాధించింది ‘క’. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాకు సుజీత్-సందీప్ దర్శకత్వం వహించారు. నయన్ సారిక హీరోయిన్ గా చేసింది.

Recent Posts

అందుకే అనుపమకి కష్టాలు!

అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More

July 8, 2025

2025: మలి సగం మెరవాల్సిందే!

6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ… Read More

July 7, 2025

సూర్య సినిమాకు రెహ్మాన్

లాంగ్ గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టిన ఎస్ జే సూర్య, చాలా జాగ్రత్తగా తన కొత్త సినిమాకు ఓ రూపు… Read More

July 7, 2025

దర్శకులు హ్యాండ్ ఇస్తున్నారు!

అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More

July 6, 2025

అప్పుడు అలా… ఇప్పుడిలా!

సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More

July 6, 2025

యాక్టర్ అయి తిరిగి డాక్టర్ గా!

రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More

July 5, 2025