హీరో నాని ప్రస్తుతం “హిట్ 3” సినిమా ప్రమోషన్లు మొదలు పెడుతున్నారు. ఈ సినిమా మే 1న విడుదల కానుంది. సో ఈ నెల రోజులు నాని హడావిడి ఉంటుంది. ఆ తర్వాత “ది ప్యారడైజ్” అనే సినిమా షూటింగ్ షురూ చేస్తాడు.
ఆ సినిమా షూటింగ్ మొదలుకాకముందే మార్చి 26, 2026న విడుదల అవుతుంది అని ప్రకటించారు. తాజాగా మరోసారి పోస్టర్ విడుదల చేసి ఏడాదిలో సినిమా వస్తోంది అని కౌంట్ డౌన్ మొదలుపెట్టింది టీం. విడుదల తేదీ విషయంలో నాని కొంచెం ఎక్కువ తొందర పడుతున్నారు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నేచురల్ స్టార్ తన సినిమాల విడుదల, వాటి ప్లానింగ్ విషయంలో కొంచెం ఎక్కువ కేర్ తో ఉంటాడు. అందుకే, ఇంత తొందరపడుతున్నాడు. ఐతే, ఈ సారి నాని ప్లానింగ్ లో మార్పులు జరగడం ఖాయం. ఎందుకంటే వచ్చే ఏడాది మార్చి 19న కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న “టాక్సిక్” రానుంది. మార్చి 26న రామ్ చరణ్ మూవీ “పెద్ది” విడుదల కానుంది. కానీ, “పెద్ది” టీమ్ ఇంకా అధికారికంగా డేట్ ప్రకటించలేదు. కానీ ఆ డేట్ ఫిక్స్ అని టీం చెప్తోంది.
రామ్ చరణ్ సినిమా, యష్ సినిమా ఆ డేట్స్ కి వస్తే నాని ఇంకో డేట్ ఏప్రిల్ 2026లో చూసుకోవాలి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More