ఉన్నట్టుండి సడెన్ గా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యాడు విజయ్ దేవరకొండ. అంతేకాదు, ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. ఢిల్లీలో జరిగిన “వాట్ ఇండియా థింక్స్ టుడే” కార్యక్రమానికి విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. ఇదే వేదికపై తన కొత్త సినిమా ‘కింగ్ డమ్’ హిందీ ట్రయిలర్ ను ప్రసారం చేశారు.
ప్రధాని మోదీని కలవడం విజయ్ దేవరకొండకు ఇదే తొలిసారి. ఇన్నాళ్లూ తన హెయిర్ స్టయిల్ కనిపించకుండా టోపీ పెట్టుకొని కవర్ చేసిన దేవరకొండ, ఈ కార్యక్రమానికి మాత్రం టోపీ తీసి సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యాడు.
కాన్ క్లేవ్ లో మాట్లాడిన విజయ్, తన కెరీర్ గురించి, కొత్త సినిమాల విషయాల గురించి మాట్లాడాడు. ‘కింగ్ డమ్’ హిందీ వెర్షన్ కు రణబీర్ కపూర్ డబ్బింగ్ చెబుతారని ఈ సందర్భంగా ప్రకటించాడు విజయ్.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ‘కింగ్ డమ్’ సినిమా. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More