దీపిక పదుకోన్ అగ్ర కథానాయిక. బాలీవుడ్ అనే కాదు భారతదేశంలో 20 కోట్ల పారితోషికం అందుకుంటున్న హీరోయిన్. ప్రియాంక చోప్రా తప్ప మిగతా ఏ హీరోయిన్ కి అంత పారితోషికం అందుకునే సీన్ లేదు. దీన్ని బట్టి చెప్పొచ్చు దీపిక పదుకోన్ రేంజ్ ఏంటో. ఐతే, అలాంటి హీరోయిన్ కూడా ఈగోకి వెళ్ళింది. తనని కాదని మరో చిన్న హీరోయిన్ త్రిప్తి డిమ్రిని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసుకున్నాడు అని దీపిక పదుకోన్ ఫీల్ అయింది. ఈగోతో ఆయన తీయబోతున్న “స్పిరిట్” సినిమాపై నెగెటివ్ ప్రచారం మొదలుపెట్టింది.
కానీ వంగా మిగతా దర్శకుల్లా సైలెంట్ గా ఉండే బాపతు కదా. రెబెల్ వరంగల్ మెంటాలిటీ. అంతే, దీపిక అసలు రూపం ఇది అని బయటపెట్టాడు పబ్లిక్ గా .”స్పిరిట్ సినిమాలో శృంగార సన్నివేశాల మోతాదు ఎక్కువ” అని కొన్ని బాలీవుడ్ మీడియా వెబ్ సైట్ లు వార్తలు ప్రచురించాయి. దీపిక అందుకే తప్పుకొంది అన్నట్లుగా ఆ వార్తలు వచ్చాయి. దాంతో, సందీప్ కి అర్థమైంది ఇదంతా దీపిక టీం రాయిస్తున్న వార్తలు అని.
దాంతో, దీపిక పేరు పెట్టకుండా ఆమె చేస్తున్న పని ఏంటో తన ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి తెలియచేశాడు. “ఇంకో పని చెయ్యి మొత్తం కథ అందరికి చెయ్యి. ఏమి చేసినా నాకు ఫరక్ పడదు,” అని ఘాటుగా దీపికకి సందేశం పంపాడు.
ALSO READ: Spirit: Sandeep Reddy Vanga hits out at Deepika Padukone for ‘leaking story’
నిజానికి ఈ మొత్తం వివాదం ఇలా మలుపు తిరగడం విచిత్రం. ఆమెకి ఎంత పారితోషికం కావాలి, ఎంత మంది స్టాఫ్ కావాలి అని ఆమె డిమాండ్ చేసింది. ఆ డిమాండ్లు నచ్చకపోతే వేరే వాళ్ళని తీసుకోవాలి. ఆమె కోరుకోవడంలో తప్పులేదు, ఆమెకి అంతా ఇవ్వాలా వద్దా అనేది నిర్మాతలు డిసైడ్ చేసుకోవాలి. కానీ ఆమె కోరికలు, డిమాండ్లు ఇవి అని వంగా టీం బయటపెట్టడం తప్పే. అందుకే, దీపిక సినిమాలోని సీన్లు ఇలా ఉండబోతున్నాయి అని ఆమె లీక్ చేసింది.
మొత్తానికి ఇద్దరూ లైన్ దాటారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More