అవీ ఇవీ

కొరియర్ లో ‘గ్రాఫిక్స్’ పంపిస్తారా?

Published by

మంచు విష్ణు చెప్పే మాటలు, ఆయన చేష్టలు విచిత్రంగా ఉంటాయి. తాజాగా జరిగిన ఒక సంఘటన ఆయన విచిత్ర వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది. మీడియా సమాచారం ప్రకారం… మంచు విష్ణు టీం తమ సినిమాకి సంబందించిన “గ్రాఫిక్స్ వర్క్”తో కూడిన హార్డ్ డిస్క్ ని ఆఫీస్ లో పనిచేసే వ్యక్తి తీసుకొని పారిపోయాడట.

సినిమాలో కీలకమైన కొన్ని సన్నివేశాలకు విజువల్ ఎఫెక్ట్స్ చెయ్యమని ఒక కంపెనీకి అప్పచెప్పితే ఆ కంపెనీ పని పూర్తి అయ్యాక ముంబై నుంచి విష్ణు ఆఫీస్ కి హార్డ్ డిస్క్ పంపించిందంట. ఎలా పంపించిందో తెలుసా? డీటీడీసి కొరియర్ లో ఆ హార్డ్ డిస్క్ ని పంపింది అని చెప్తున్నారు. ఆఫీస్ లో ఉన్న వ్యక్తి ఆ కొరియర్ రాగానే దాన్ని తీసుకొని ఉడాయించారట. దాంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని తెలుగు టీవీ ఛానెల్స్ ప్రసారం చేశాయి.

లక్షలు, కోట్ల రూపాయల వర్క్ చేసే గ్రాఫిక్స్ కంపెనీలు అయిదు వందలో, వెయ్యి రూపాయలు పెట్టి డీటీడీసి కొరియర్ లో పంపించేసి చేతులు దులుపుకుంటాయా. అది ఏమైనా అమెజాన్ లో కొన్న వస్తువా? నిజంగా డీటీడీసి కొరియర్ లోనే పంపించే అంత చౌకబారు కంపెనీకి విజువల్ ఎఫెక్ట్స్ చేసే పని అప్పగించినందుకు విష్ణుని నిందించాలి.

రెండోది, కొరియర్ లో పంపించిన హార్డ్ డిస్క్ నిజంగానే ఎవరో ఎత్తుకపోతే మరో హార్డ్ డిస్క్ ఆ కంపెనీ పంపలేదా? విష్ణు టీం నిజంగా ఇలా జరిగింది అని చెప్పింది అనుకోండి, మీడియాకైనా బుర్ర ఉండాలి కదా ఈ వార్త వేసేందుకు. ఏ కంపెనీ అయినా డీటీడీసి కొరియర్ లో హార్డ్ డిస్క్ ని పంపిస్తుందా అనే ప్రశ్న మీడియాకి రావాలి కదా.

ఇదంతా రాబోయే “కన్నప్ప” అనే సినిమా గురించి. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మిస్తున్న సినిమా ఇది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి పేరొందిన నటులు ఈ సినిమాలో అతిథి పాత్రల్లో నటించారు. అంత పెద్ద స్టార్స్ నటించినా విష్ణు కొరియర్లో గ్రాఫిక్స్ పంపే కంపెనీకి పనులు అప్పచెప్పాడు అనుకోవాలా?

Recent Posts

వైరల్: బెల్ బాటమ్ పవన్ కల్యాణ్

సైలెంట్ గా తన సినిమాల్ని పూర్తి చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఓవైపు రాజకీయ కార్యకలాపాలు చూసుకుంటూనే మరోవైపు సినిమాల్ని పూర్తిచేసే… Read More

May 29, 2025

యువరాణితో బెల్లంకొండ పెళ్లి!

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించిన 'భైరవం' సినిమా రేపు (మే 30) విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక… Read More

May 29, 2025

అఖిల్ పెళ్లికి అంతా సిద్ధం

అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజా మోగనుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో వారం రోజుల్లో అఖిల్ పెళ్లి జరగనుంది.… Read More

May 29, 2025

త్రిప్తికి ఫాలోవర్స్ పెరుగుతున్నారు!

త్రిప్తి డిమ్రి లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ప్రభాస్ సరసన నటిస్తోంది త్రిప్తి. "స్పిరిట్" సినిమాలో దీపిక చెయ్యాల్సిన పాత్ర ఆమెకి… Read More

May 28, 2025

గుండు పోలీస్ తో నటించాలి!

అలియా భట్ కి ఇప్పుడు ఒక పెద్ద హీరోతో నటించాలన్న కోరిక లేదు. ఒక మలయాళం హీరోతో ఒక సినిమా… Read More

May 27, 2025

అవి తప్ప అన్నీ చేస్తా: నారా రోహిత్

కొంత గ్యాప్ తర్వాత నారా రోహిత్ మళ్ళీ నటుడిగా మన ముందుకు వస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన "భైరవం"… Read More

May 27, 2025