న్యూస్

అనుష్క, పుష్ప పక్కపక్కన!

Published by

సైలెంట్ గా తన సినిమా పూర్తి చేస్తోంది అనుష్క. క్రిష్ దర్శకత్వంలో “గాటి” అనే సినిమా షూట్ నడుస్తోంది. ప్రస్తుతం నైట్ షూట్ చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలోని ఈ సెట్ కు పక్కనే “పుష్ప-2” షూట్ నడుస్తోంది. అల్లు అర్జున్ పై కొన్ని సన్నివేశాలు తీస్తున్నాడు సుకుమార్.

అల్యూమినియం ఫ్యాక్టరీలో రామ్-పూరి బిజిబిజీగా ఉన్నారు. “డబుల్ ఇస్మార్ట్” కోసం రామ్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడు పూరి. ఇక ఇదే లొకేషన్ లో “విశ్వం” షూట్ కూడా నడుస్తోంది. సునీల్ మరికొందరు ఆర్టిస్టులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడు శ్రీనువైట్ల.

ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమా “కుబేర”. ఈ సినిమా కోసం ఆల్రెడీ ఓసారి ముంబయి వెళ్లొచ్చింది యూనిట్. ఇప్పుడు మరోసారి ముంబయిలోనే కొత్త షెడ్యూల్ మొదలైంది.

అటు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ హైదరాబాద్ లోనే తమతమ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్ “మట్కా” కోసం, సాయితేజ్ కొత్త సినిమా కోసం హైదరాబాద్ లో 2 వేర్వేరు సెట్స్ వేశారు. అందులో షూటింగ్స్ నడుస్తున్నాయి.

Recent Posts

రష్మిక ముందే సిద్ధం అవుతోందా

రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More

June 28, 2025

శ్రద్ధ శ్రీనాథ్ కూడా అదే రూట్లోకి

గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More

June 28, 2025

విష్ణు… ట్రోలింగ్ నుంచే సక్సెస్

మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More

June 28, 2025

ప్రభాస్ మేనియా పని చేస్తుందా?

'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More

June 26, 2025

బికినీ ఫోటోలకు ఇది టైమా?

సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More

June 26, 2025

శుక్రవారం నుంచి ‘సదానిర’

"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్‌ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More

June 26, 2025