దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ ఫ్లాట్ ను అమ్మకానికి పెట్టారు. ఇప్పుడా ఫ్లాట్ ను నటి అదా శర్మ దక్కించుకుంది.
సుశాంత్ ఫ్లాట్ ను అదా శర్మ కొనుగోలు చేసినట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ నటి వాటిని ధృవీకరించింది. నెల రోజులుగా తను సుశాంత్ ఫ్లాట్ లోనే ఉంటున్నట్టు వెల్లడించింది. ఇంటికి కొన్ని మార్పుచేర్పులు కూడా చేసినట్టు వెల్లడించింది.
ఫస్ట్ ఫ్లోర్ మొత్తాన్ని దేవుడి గదిగా మార్చేసిందట అదా. పై ఫ్లోర్ లో ఓ గదిని మ్యూజిక్ రూమ్ గా, మరో గదిని డాన్స్ స్టుడియోగా మార్చింది. ఇక టెర్రస్ మొత్తాన్ని గార్డెన్ గా మార్చేసిందట. తను ఎక్కడున్నా పచ్చదనం ఉండాలని, పక్షులకు ఆహారం పెట్టడం తనకు ఇష్టమని, అందుకే గార్డెన్ పెట్టుకున్నానని తెలిపింది.
సుశాంత్ ఇంట్లో అడుగుపెట్టగానే తనకు ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ కలిగిందని, దాన్ని మరింత పెంచేందుకు ఇళ్లు మొత్తానికి తెలుగు రంగు పెయింట్ వేయించినట్టు వెల్లడించింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More