సీనియర్ నటి రవీనా టాండన్ తప్పతాగి రోడ్డుపై వీరంగం చేసినట్టు బాలీవుడ్ లో ఓ సెక్షన్ మీడియా కథనాలు ప్రచురించింది. వీటిని ముంబయి పోలీసులు ఖండించారు. రవీనా టాండన్ తాగలేదని ప్రకటించిన పోలీసులు, ఈ మేరకు జరిగిన విషయాన్ని బయటపెట్టారు.
రవీనా నివాసానికి సమీపంలో కారును పార్క్ చేసేందుకు ప్రయత్నించాడు ఆమె డ్రైవర్. ఈ క్రమంలో కారును రివర్స్ చేస్తున్నప్పుడు ఓ మహిళను కారు ఢీ కొట్టిందనే పుకారు వ్యాపించింది. మహిళ అరుపులతో చుట్టుపక్కల వాళ్లు గుమిగూడి కారును అడ్డగించారు.
దీంతో తన డ్రైవర్ ను రక్షించేందుకు రవీనా టాండన్ గుంపులోకి వెళ్లారు. తనను కొట్టొద్దంటూ ఆమె అరుస్తున్న మాటలు రికార్డ్ అయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, సొసైటీలో ఉన్న సీసీటీవీ కెమెరా ఫూటేజ్ ను క్షుణ్నంగా పరిశీలించారు. రివర్స్ తీసుకున్న కారు, సదరు మహిళను ఢీ కొట్టలేదని నిర్ధారించారు.
కేవలం గొడవలు సృష్టించేందుకే ఓ గుంపు అలా వ్యవహరించింది, రవీనా తాగి దాడికి దిగిందని అసత్య ఆరోపణలు చేశారంటూ పోలీసులు స్పష్టం చేశారు. ఆ టైమ్ లో రవీనా ఆల్కహాల్ సేవించలేదని పోలీసులు ప్రకటించారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More