బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంటే కార్తీక్ ఆర్యన్, అర్జున్ కపూర్ లాంటి హీరోల పేర్లు చెబుతాం. అయితే వీళ్లతో పాటు అదే ఇండస్ట్రీలో ముదురు బ్యాచిలర్స్ కూడా ఉన్నారు. ఈ లిస్ట్ లో ముందు వరుసలో ఉన్నది సల్మాన్ కాగా, హృతిక్-అమీర్ కూడా ప్రస్తుతం బ్యాచిలర్స్ కిందే లెక్క. అంతేకాదు, లేటు వయసులో వీళ్లు తమ డేటింగ్స్ తో అందర్నీ ఆకర్షిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ సంగతి అందరికీ తెలిసిందే. ఇంకొన్ని నెలలు గడిస్తే షష్ఠిపూర్తి అవుతుంది. ఇప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోడు కూడా. అయితే ఇతడి లైఫ్ లో ఎఫైర్లు, డేటింగ్స్ మాత్రం పుష్కలంగా ఉన్నాయి. 90వ దశకంలో ఇతడు డేటింగ్ చేయని హీరోయిన్ లేదంటారు బాలీవుడ్ జనం. కాబట్టి ఇప్పటికీ ఎప్పటికీ ఈయన బ్యాచిలరే.
ఇక హృతిక్ తన డేటింగ్ తో ఆకర్షిస్తున్నాడు. 51 ఏళ్ల ఈ హీరో తన భార్య సుసేన్ కు విడాకులిచ్చాడు. ఆ తర్వాత సబా ఆజాద్ కు కనెక్ట్ అయ్యాడు. దాదాపు ముడేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. రీసెంట్ గా పబ్లిక్ లోకి కూడా వచ్చారు. సో.. ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం.
మరో నటుడు అమీర్ ఖాన్ కూడా బ్యాచిలరే. 60 ఏళ్ల ఈ హీరో ఆల్రెడీ 2 సార్లు పెళ్లి చేసుకున్నాడు. విడాకులు కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఫ్రెష్ గా ప్రేమలో పడ్డాడు. ఈయన లవర్ పేరు గౌరీ స్ప్రాట్. ప్రస్తుతం ఈమెతోనే సహజీవనం చేస్తున్నాడు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More