దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు శతాధిక చిత్రాల దర్శకుడు. నేటి తరంలో చాలా మంది కె. రాఘవేంద్రరావు బీఏ అంటే హీరోయిన్ల బొడ్డుపై పళ్ళు, పూలు చెల్లించే దర్శకుడు అని మాత్రమే భావిస్తారు. కానీ ఆయనది 50 ఏళ్ల ఘన చరిత్ర. తెలుగు సినిమా వ్యాపారాన్ని భారీగా పెంచిన దర్శకుడు ఆయన. కమర్షియల్ మేకింగ్ కి కొత్త గ్రామర్ నేర్పాడు. నిన్న మొన్నటి వరకు మిగతా తెలుగు దర్శకులు ఆయన పద్ధతినే ఫాలో అయ్యారు.
రాఘవేంద్రరావు తీసిన మొదటి చిత్రం… బాబు. శోభన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా 1975 మే 2న విడుదల అయింది. అంటే నేటితో ఆయన దర్శకుడిగా మారి 75 ఏళ్ళు. ఆయన వయసు ఇప్పుడు 82. దర్శకుడిగా వయసు 50.
“ప్రేమ్ నగర్” వంటి గొప్ప చిత్రాలు తీసిన కె.ఎస్. ప్రకాష్ రావు కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రాఘవేంద్రరావు. తండ్రి బాటలోనే దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించి “బాబు” చిత్రంతో దర్శకుడు అయ్యారు.
ఎనిమిదో చిత్రంగా తీసిన “అడవి రాముడు” చిత్రంతో రాఘవేంద్రరావు జీవితం, కెరీర్ మారిపోయాయి. ఆ రోజుల్లో ఆ సినిమా 4 కోట్ల వసూళ్లు పొందింది. అప్పటికి అది ఆల్ టైం రికార్డు. హీరోగా ఎన్టీఆర్ కెరీర్ కూడా కొత్త మలుపు తిరిగింది ఆ సినిమాతో. పూర్తిగా ఈ తరహా చిత్రాల వైపు మళ్లిపోయారు ఎన్టీఆర్.
అడవిరాముడు, పదహారేళ్ళ వయసు, వేటగాడు, ఘరానా దొంగ, ఊరికి మొనగాడు, కొండవీటి సింహం, దేవత, అడివిసింహాలు, బొబ్బిలి బ్రహ్మన్న, అడవిదొంగ, హిమ్మత్ వాలా, అగ్నిపర్వతం, జానకి రాముడు, ఆఖరి పోరాటం, జగదేకవీరుడు అతిలోక సుందరి, రౌడీ అల్లుడు, అన్నమయ్య, ఘరానా మొగుడు, అల్లరి ప్రియుడు, పెళ్లి సందడి, శ్రీరామదాసు వంటి అనేక హిట్ చిత్రాలు తీశారు.
వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోల మొదటి చిత్రాలను డైరెక్ట్ చేసింది రాఘవేంద్ర రావు. ఇటీవల కాలంలో సెన్సేషన్ గా మారిన శ్రీలీలని తెలుగు తెరకు పరిచయం చేసింది కూడా ఆయనే.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More