గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి చిత్రం… ‘విశ్వం’. అక్టోబర్ 11న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ ఓ భాగంగా శ్రీను వైట్ల ముచ్చటించారు.
‘విశ్వం’ఎలా మొదలైంది?
గోపీచంద్, నేను ఎప్పటినుంచో సినిమా చేయాలనుకున్నాం. కథ నచ్చితే వెల్దామన్నాడు గోపీచంద్. రాసుకున్న కథ బాగా వచ్చాక మొదలుపెట్టాం. ఎమోషన్స్ తో కూడిన వినోదాత్మక చిత్రం చేయాలని డెప్త్ లోకి వెళ్ళి ఈ సినిమా చేశాను. యాక్షన్ తోపాటు హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది.
పాప చుట్టూ కథ తిరుగుతుందా?
అవును. ఇందులో పాప పాత్ర కీలకం. కథకి, టైటిల్ కి సంబంధం ఉంది. కథ ప్రకారమే పెట్టాం. విశ్వంలో చాలా సీక్రెట్స్ వుంటాయి. అలాగే ఈ విశ్వంలో కూడా చాలా విషయాలుంటాయి.
‘విశ్వం’లో మెయిన్ థీమ్ ఏమిటి?
పదేళ్ళ నాడు హీరో తెలివితేటలతో ఏదైనా సాధించగలగడు అనే కథలు వచ్చాయి. ఈ సినిమా అలా వుండదు. బర్నింగ్ ఇష్యూ తీసుకుని దాన్ని ఎంటర్ టైన్ మెంట్ లో ఎలా చెప్పొచ్చో చేశాను. మేకింగ్ వైజ్ గా వినూత్నంగా వుంటుంది. నాకూ, గోపీకు చాలా ఫ్రెష్ సినిమా అవుతుంది.
‘వెంకీ’ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ లా విశ్వంలో వున్నట్లుంది?
నేను ఇందులోనూ ట్రైన్ ఎపిసోడ్ కథకు అవసరం అని పెట్టాను. ముందు ఇలా అనుకున్నప్పుడు వెంకీతో కంపేర్ చేస్తారనిపించింది. కానీ దానికి దీనికి చాలా తేడా వుంటుంది. 30 నిముషాల పాటు వెన్నెల కిశోర్, గణేష్, నరేష్, కవిత, చమక్ చంద్ర, షకలక శంకర్ వీరందరితో టైన్ జర్నీ చాలా బాగుంటుంది.
కామెడీ టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ వచ్చేసింది. మరి సినిమా చేసేటప్పుడు మీకు కష్టంగా అనిపించలేదా?
ఇప్పుడు ప్రేక్షకులు సందర్భానుసారంగా రాసుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకానీ సోషల్ మీడియాలో కంటెంట్ తీసుకోకూడదు. మనమే సన్నివేశాలు క్రియేట్ చేయాలి. కథలోనే కామెడీ వుండడం ఒకరకంగా టఫ్ అయినా కష్టపడి చేశాం.
మీ గత సినిమాల్లో వ్యంగ్యం ఎక్కువ. ఇందులో అలా ఉందా?
నా శైలి సెటైర్. ఢీ నుంచే మన సినిమాలో అటువంటి ప్లే స్టార్ట్ అయింది. అందుకే వెంకీ చిత్రం రిరిలీజ్ కు మంచి అప్లాజ్ వచ్చింది. విశ్వంలో హీరోయిజం, విలన్ పాత్రలు రియలిస్ట్ గా వుంటాయి. వారికి తోడు వెన్నెల కిశోర్, నరేష్, గణేష్, ప్రుధ్వీ వంటి పాత్రలు హైలైట్ గా వుంటాయి.
‘ఢీ’ సీక్వెల్ ఎప్పుడు?
శ్రీహరిగారిని రీప్లేస్ చేయడం కష్టం. అందుకే, అది మొదలు కాలేదు.
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More
6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ… Read More
లాంగ్ గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టిన ఎస్ జే సూర్య, చాలా జాగ్రత్తగా తన కొత్త సినిమాకు ఓ రూపు… Read More
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More