ఇంటర్వ్యూలు

నవ్వించే పాత్ర నాది: రమ్య పసుపులేటి

Published by

రావు రమేష్, ఇంద్రజ జంటగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఇందులో రావు రమేష్ కుమారుడిగా అంకిత్ కొయ్య, అతని సరసన రమ్య పసుపులేటి నటించారు.. ఈ సందర్భంగా రమ్య పసుపులేటి మీడియాతో మాట్లాడారు.

రమ్య గారు… మీ గురించి చెప్పండి!
నాకు నాలుగైదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి యాడ్స్ చేస్తున్నాను. అనుష్క గారి ‘పంచాక్షరీ’లో బాలనటిగా చేశా. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ‘స్పైడర్’లోనూ ఓ రోల్ చేశా. ఆ తర్వాత చదువుకోవాలని గ్యాప్ తీసుకున్నాను. బ్యాచిలర్స్ ఫినిష్ చేసి సినిమాల్లోకి వచ్చాను. ప్రజలకు రీచ్ అవ్వడానికి ఇన్‌స్టాగ్రామ్‌ హెల్ప్ అయ్యింది.

‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’లో మీకు అవకాశం ఎలా వచ్చింది?
దర్శకుడు లక్ష్మణ్ కార్య గారు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో చూశారట. ఈ అమ్మాయిని పిలవండి, ఆడిషన్ చేద్దామని టీమ్ మెంబర్లతో చెప్పారట. ఆఫీసుకు వెళ్లాక ఆడిషన్ చేశారు. నా పెర్ఫార్మన్స్ నచ్చడంతో ఎంపిక చేశారు. చాలా రోజుల తర్వాత మంచి అవకాశం రావడంతో హ్యాపీగా ఫీలయ్యాను.

కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏమిటి?
నవ్వించడం కష్టం. ప్రేక్షకుల్ని నవ్వించగలిగితే క్యారెక్టర్ పండినట్టు. ఇందులో నా పాత్ర ద్వారా నవ్వించే అవకాశం వచ్చింది. సినిమా చూసిన వాళ్లు అందరికీ నా రోల్ నచ్చుతుంది. 

‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ట్రైలర్ చూస్తే గ్లామర్, ట్రెడిషనల్… రెండు విధాలుగా కనిపిస్తున్నారు!
‘మేడమ్ సార్ మేడమ్’ సాంగ్ చూస్తే… నన్ను అన్ని విధాలుగా చూపించారు. నేను 18 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి రోల్ చేశా. క్యూట్ అండ్ క్రింజ్ లవ్ స్టోరీ ఉంటుంది. గ్లామర్, ట్రెడిషనల్… రెండు విధాలుగా కనిపిస్తా.

మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
బబ్లీ, క్యూట్ అండ్ ఇన్నోసెంట్ అమ్మాయి. కొంచెం తింగరితనం ఉంటుంది. కానీ, చాలా నవ్విస్తా. నాకు కామెడీ చేయడం చాలా ఇష్టం. ఎమోషన్స్ కూడా బాగా చేస్తా.

Recent Posts

మేం ఆటబొమ్మలం కాదు

నిత్యా మీనన్ ఇచ్చి పడేసింది. సోషల్ మీడియాలో ఒక్కోసారి ఉన్నట్టుండి ఫైర్ అవుతుంది ఈ బ్యూటీ. ఇది కూడా అలాంటి… Read More

June 2, 2025

ఈనెల వారానికో క్రేజీ మూవీ!

మే నెల గడిచిపోయింది. జూన్ లో మరికొన్నిక్రేజీ మూవీస్ వస్తున్నాయి. వీటిలో ముందుగా వస్తున్న సినిమా 'థగ్ లైఫ్'. దాదాపు… Read More

June 2, 2025

ఇంత ఓవరాక్షన్ అవసరమా?

సినిమా రిలీజ్ కు ముందు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెడతారు. పెళ్లికి ముందు ప్రీ-వెడ్డింగ్ షూట్ చేస్తారు. మరి పుట్టినరోజుకు ముందు… Read More

June 1, 2025

మేలో ఒక హిట్, ఒక యావరేజ్

సాధారణంగా మే నెల వేసవి సెలవుల కాలానికి చాలా కీలకం. అసలైన కలెక్షన్లు మేలోనే వస్తాయి. కానీ 2025లో సీన్… Read More

June 1, 2025

భారీ సెట్ లో ‘డ్రాగన్’ షూటింగ్

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'డ్రాగన్' అనే పేరు పరీశీలనలో ఉంది.… Read More

June 1, 2025

ఇండస్ట్రీకి ‘రీ రిలీజు’లు శాపం!

తెలుగు సినిమా కొంతకాలంగా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కొత్త సినిమాలకు కలెక్షన్లు ఉండడం లేదు. ఎంత ప్రచారం చేసినా కొన్ని… Read More

June 1, 2025