లక్ష్మీ రాయ్.. ఎప్పుడు చూసినా లగ్జరీ కార్లలో తిరుగుతుంది. ఖరీదైన హోటల్స్ లో బస. మెహ్రీన్.. ఎప్పుడు చూసినా విదేశాల్లో కనిపిస్తుంది, రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. వేదిక.. ప్రతిసారి ఏదో ఒక లగ్జరీ రిసార్ట్ లో కనిపిస్తుంది.
పూనమ్ బజ్వా, ప్రియా వడ్లమాని, డింపుల్ హయతి, పాయల్ రాజ్ పుత్, ప్రియాంకా జవాల్కర్.. వీళ్లంతా స్టార్స్ కాదు. రెగ్యులర్ గా సినిమాలు కూడా చేయరు. మరి వీళ్లకు మెయింటెనెన్స్ కు ఇంత డబ్బు ఎలా వస్తోంది? అంత రిచ్ గా వీళ్లు ఎలా ఉండగలుగుతున్నారు?
ఒక్కసారి పాపులారిటీ వస్తే చాలు, సినిమాలు మాత్రమే ఇప్పుడు ఆదాయ మార్గాలు కావు. ఎన్నో దారులున్నాయి. వీళ్లంతా ఆ దారుల్లోనే వెళ్తున్నారు.. డబ్బు సంపాదిస్తున్నారు.
ఉదాహరణకు లక్ష్మీరాయ్ నే తీసుకుంటే, ఈమె ఓ షాప్ ఓపెనింగ్ కు వస్తే 5-6 లక్షలు తీసుకుంటుంది. మిగతా హీరోయిన్లు కూడా దాదాపు ఇదే మొత్తం అందుకుంటారు. ఇవి కాకుండా ఫొటోషూట్స్ ద్వారా వీళ్లు డబ్బులు సంపాదిస్తారు. అటు సోషల్ మీడియా ఉండనే ఉంది. ఇనస్టాగ్రామ్ లో పెయిడ్ ప్రమోషన్స్ చేస్తారు.
వీళ్ళందరికీ ఇన్ స్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తారు. దాంతో ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ పాపులారిటీ వల్ల ఇన్ ఫ్లుయెన్సర్ ఆదాయం బాగానే వస్తోంది వీరికి.
ఇలా సినిమాల్లేకపోయినా, వీళ్లకు ఆదాయానికి ఢోకా లేదు. కాకపోతే స్టార్ హీరోయిన్లు ఒక్క సినిమాకు కోటి రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటే, వీళ్లు అంత సంపాదించడానికి పైన చెప్పిన చాలా మార్గాలు అనుసరించాల్సి వస్తుంది. అంతే తేడా.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More