అవీ ఇవీ

ప్రభాస్ మేనియా పని చేస్తుందా?

Published by

‘కన్నప్ప’లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా చాలామంది నటించారు. అయితే ఎంతమంది ఉన్నప్పటికీ, విష్ణు మాత్రం ప్రభాస్ నే నమ్ముకున్నాడు. ప్రభాస్ ఇమేజ్ అలాంటిది మరి.

ప్రభాస్ ఫ్యాన్స్, తన చిత్రానికి బ్రహ్మరథం పడతారని విష్ణు ఊహిస్తున్నారు. అందుకే ముందువెనక ఆలోచించకుండా బడ్జెట్ పెట్టాడు.

‘కన్నప్ప’ రేపే విడుదల అవుతోంది. అన్ని భాషల్లో భారీగా రిలీజ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ట్రెండ్ మొదలైంది. చాలా మెల్లగా సీట్లు నిండుతున్నాయి. ఐతే, ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా బుకింగ్స్ మొదలుపెట్టలేనట్లు కనిపిస్తోంది.

సినిమా రిలీజైన తర్వాత పాజిటివ్ టాక్ వచ్చి, ప్రభాస్ పాత్ర గట్టిగా క్లిక్ అయితే ‘కన్నప్ప’కు తిరుగుండదు. మరి ప్రభాస్ మేనియా పని చేస్తుందా? ఈ సినిమాకి ప్రభాస్ డబ్బులు తీసుకోలేదు. విష్ణు, మోహన్ బాబుతో ఉన్న అనుబంధం కారణంగా ఫ్రీగా చేశారు. కానీ ప్రభాస్ పాత్ర బాగుంది అని, అది సినిమాకి హెల్ప్ అవుతుంది అని విష్ణు నమ్ముతున్నాడు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ ఏమి చేస్తారో చూడాలి.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025