ఈమధ్య ఒకేసారి 2 సినిమాలకు సంబంధించిన లుక్స్ లీక్ అయ్యాయి. వీటిలో ఒకటి ‘పుష్ప-2’ నుంచి కాగా, రెండోది ‘కన్నప్ప’ సినిమా నుంచి. అయితే లుక్ లీకైన వెంటనే ‘పుష్ప-2’ యూనిట్ అప్రమత్తమైంది. అదే పని ‘కన్నప్ప’ యూనిట్ చేయలేకపోయింది.
‘పుష్ప-2’ సినిమాకు సంబంధించి ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఐటెంసాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో శ్రీలీల చేస్తోంది. ఈ ఐటెంసాంగ్ షూట్ కు సంబంధించి శ్రీలీల-బన్నీ ఉన్న లుక్ లీకైంది.
ఇలా లుక్ లీక్ అయిందో లేదో అలా యూనిట్ అప్రమత్తమైంది. తమ సినిమాలో శ్రీలీల ఉందంటూ.. ఆమె ఫస్ట్ లుక్ ను అఫీషియల్ గా విడుదల చేసేసింది. అదే పని ‘కన్నప్ప’ యూనిట్ మాత్రం చేయలేదు.
మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రేపోమాపో అతడి లుక్ ను విడుదల చేయాలనేది ప్లాన్. అంతలోనే ఓ వ్యక్తి ప్రభాస్ లుక్ ను లీక్ చేశాడు. అతడ్ని పట్టుకున్నారు కూడా.
ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఇప్పటికే చాలామంది మొబైల్ ఫోన్స్ లోకి ప్రభాస్ లుక్ వెళ్లిపోయింది. చాలామంది దాన్ని స్క్రీన్ సేవర్స్ గా, వాల్ పేపర్స్ గా పెట్టేసుకున్నారు కూడా. ఇంత జరిగిన తర్వాత వెంటనే ఆ లుక్ ను అధికారికంగా రిలీజ్ చేస్తే బాగుండేది. కానీ ‘కన్నప్ప’ టీం ఇంతవరకు ఆ పని చేయలేదు.
సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో సహజీవనం చేస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. వాటికి ఊతం ఇస్తూ ఇటీవల… Read More
శంకర్ ఇటీవలే తెలుగులో అరంగేట్రం చేశారు. ఆయన మూడేళ్లు పాటు సాగదీసి తీసిన "గేమ్ చేంజర్" ఈ ఏడాది సంక్రాంతికి… Read More
దీపిక పదుకోను అడిగిన పారితోషికం, ఆమె పెట్టిన డిమాండ్లు అర్థంపర్థం లేనివి. అందులో అనుమానం లేదు. ఐతే పారితోషికం విషయంలో… Read More
తెలుగు నుంచి అనేక చిత్రాలు 1000 కోట్లు కొల్లగొట్టినవి ఉన్నాయి. బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్, పుష్ప 2,… Read More
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More